వేలేరు : భూసార పరీక్షలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వేలేరు మండల వ్యవసాయ అధికారి కవిత అన్నారు. మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాత అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శాలపల్లి గ్రామంలో నిర్వహించారు.
యూరియా వాడటం, సాగు ఖర్చుని తగ్గించుకోవటం, అవసరం మేరకు రసాయన ఎరువుల వినియోగం, నీటి వినియోగం, పంటల మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అదే విధంగా గొలపల్లిలో పండించే వివిధ పంటలతో సస్యరక్షణ పద్దతులు, రైతులు అడిగిన అనేక సమస్యలకు పరిష్కారం సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, శాలపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.