వరంగల్, జూన్ 20 : పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుల్లో రాణిస్తారని డీఎంహెచ్‌వో సాంబశివరావు అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్య, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి మధురిమ, విద్యా శాఖ గర్ల్ చైల్డ్ అధికారి రాధాదేవి, ప్రధానోపాద్యాయురాలు ఉమాదేవి, ఇమ్యునైజేషన్ అధికారి ఇఫ్తికర్ అలీ, అడిషనల్ డీఎంహెచ్‌వో మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకూబ్ పాషా, మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
పరకాల : పట్టణంలోని 1వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిలర్ మడికొండ సంపత్‌కుమార్ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. 18యేళ్ల లో పు వారు తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్ మడికొండ భాగ్య, ఆశ కార్యకర్తలు కవిత, సుధ పాల్గొన్నారు.
భీమదేవరపల్లి : విద్యార్థుల్లో నులిపురుగులు రాకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ జక్కుల అనిత అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వంగ రవి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, వైద్యాధికారులు రహమాన్, రుబీనా, సిబ్బంది కేఎల్ఎన్ స్వామి, స్వరూప, శ్యామల, ఉపాధ్యాయులు శ్రీకాంత్, ప్రదీప్, సుధారాణి, స్టాలిన్, ఎల్లయ్య, రామకృష్ణారెడ్డి, మోహన్, సమ్మిరెడ్డి, ఉమ, దుర్గయ్య పాల్గొన్నారు.
దామెర : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంపీడీవో కల్పన మాట్లాడుతూ.. పిల్లల్లో నులిపురుగులు ఉంటే ఎదుగుదల సరిగా ఉండదన్నారు. ప్రతి విద్యార్థి ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ మంజూల, సూపర్వైజర్ శ్రీకాంత్, హెచ్ఎం లకావత్ రాజేశ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.
కమలాపూర్ : స్థానిక టాకీస్ ఏరి యా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. హెచ్ఎం పవన్‌కుమార్ పాల్గొన్నారు.