Karthika Deepam | ఐనవోలు (హనుమకొండ): ఐనవోలు దేవుడి గుట్టపైన అఖండ జ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. మల్లికార్జునస్వామి ఆలయ ఆధ్వర్యంలో అఖండజ్యోతి కార్యక్రమం కనుల పండువగా నిర్వహంచారు. దక్షిణ భాతరదేశంలో కార్తీక పౌర్ణమిరోజు గిరిపై అఖండజ్యోతి వెలిగించే నాల్గో దేవాలయం ఐనవోలు ఒక్కటి. కేరళలోని శబరిమల, తమిళనాడులోని అరుణాచలంతో పాటు పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనరసింహ ఆలయం తరహాలోనే పురాతన చరిత్ర కలిగి ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో కంటే ముందు గుట్టపైనే ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి.

ఇంతటి చరిత్ర కలిగిన గుట్టపై శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజు దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఆలయ ఈవో కందుల సుధాకర్, ఎస్ఐ శ్రీనివాస్, అఖండజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకుల బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య నడుమ కనుల పండువగా అఖండ జ్యోతి వెలిగించారు. అఖండజ్యోతిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దివ్యజ్యోతి సుమారుగా 10 కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు కనిపించింది. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు దేవాలయం ఆవరణంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. జ్వాలాతోరణం గుండాస్వామి వారిని పల్లకీలో ఉంచి మూడుసార్లు తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయా చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, డైరెక్టర్లు, అర్చకులు పాతర్లపాటి నరేశ్ శర్మ, దేవేందర్ వేదపండితులు పురుశోత్తమశర్మ, విక్రాంత్ వినాయ్ జ్యోషి, భానుశర్మ, మధుశర్మ, రాజు, శ్రీకాంత్, కన్నయ్య, రాజు, రాజు పాల్గొన్నారు.