నర్సంపేట/నర్సింహులపేట, డిసెంబర్11: మండలంలోని మాధన్నపేట చెరువులోకి బుధవారం ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లి ఏఈవో మృతి చెందాడు. మరొకరు క్షేమం గా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన మిర్యా ల వెంకన్న కుమారుడు విష్ణు (25) ఇదే మండలంలోని జ యపురం, కౌసల్యదేవిపల్లి, కొమ్ములవంచ గ్రామాలకు వ్యవసాయ వి స్తరణ అధికారి (ఏఈవో)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం వి ష్ణు తన స్నేహితుడు పట్నూరి ప్రేమ్‌కుమార్‌తో కలిసి కారులో నర్సంపేటలోని ఓ వివాహానికి హాజరై దగ్గర్లో ఉన్న మాధన్నపేట పెద్ద చెరువు కట్టపైకి వెళ్లారు.
అక్కడ మద్యం సేవించి తిరిగి ఇంటికి బయలుదేరగా చెరువు కట్టపై కారు స్పీడ్ కంట్రోల్కాక అదుపు తప్పి అందులో పడిపోయింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న విష్ణు స్టీరింగ్ మధ్యలోనే ఇరుక్కుపోగా, ప్రేమ్‌కుమార్ కారు డోర్ తీసుకొని బయటపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. న ర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమా ర్, టౌన్ సీఐ రమణమూర్తి, ఎస్సై అరుణ్‌కుమార్ సి బ్బందితో కలిసి ఘటనా స్థ లానికి చేరుకొని స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టా రు. దాదాపు 2 గంటలు శ్రమించి కారును జేసీబీ సహాయంతో ఒడ్డుకు చేర్చగా అప్పటికే విష్ణు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రేమ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, విష్ణుకు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్లు తెలిసింది. ఏఈవో మృతితో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నర్సింహులపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.