వరంగల్చౌరస్తా, నవంబర్6 : వరంగల్ నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల సందడి చేసింది. స్టేషన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను గురువారం ఆమె ప్రారంభించారు. వినియోగదారులకు అందుబాటులో ఉంచిన నూతన వెరైటీ చీరలను ప్రదర్శిస్తూ మురిసిపోయారు. అనంతరం మాట్లాడుతూ వరంగల్లో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. మహిళలు, కాలేజీ స్టూడెంట్లకు సరికొత్త డిజైన్లతో అందించడానికి ఈ షోరూం మంచి అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
తనపై ఇంతటి అభిమానాన్ని చూపుతున్న వరంగల్ ప్రజలు, అభిమానులకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నారు. హీరోయిన్ శ్రీలీల వస్తున్న విషయం తెలిసి అభిమానులు వేల సంఖ్యలో చేరుకోవడంతో స్థానిక ఇంతెజార్గంజ్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా, ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను దారి మళ్లించారు.
