వరంగల్ లీగల్, ఫ్రిబవరి 5 : పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడి చేసిన నిందితుడు మినుముల అఖిల్‌కు 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి అపర్ణాదేవి సోమవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఐనవోలు మండలానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ఏప్రిల్ 10, 2019న వర్ధన్నపేట శివారు అంబేదర్ నగర్‌కు చెందిన మినుముల అఖిల్ వ్యవసాయ భూముల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు.
బాలిక ఫిర్యాదుతో అప్పటి సీఐ శ్యాంసుందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని గుర్తించి సాక్ష్యాలను సేకరించి చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువైనందున జడ్జి నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ మల్లారెడ్డి వాదించగా, లైసన్ ఆఫీసర్ పరమేశ్వరి, భరోసా సెంటర్ ప్రతినిధి నీలిమ, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ సీహెచ్ రాజు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.