హనుమకొండ చౌరస్తా, మే 20 : నగరంలో ఓ యువతి చీరకట్టులో స్పోర్ట్స్ బైక్‌పై చక్కర్లు కొట్టింది. బైక్‌పై రయ్‌మంటూ నగరవీధుల్లో దూసుకెళ్లింది. వరంగల్ నుం చి హనుమకొండ రోడ్డులో తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. చీర కట్టుకుని హెల్మెట్ పెట్టుకుని ఆమె బైక్ నడుపుతుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొందరు వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతేకాకుండా ఆ యువతి ముఖానికి మాస్కు, హెల్మెట్ ధరించి రాత్రివేళ పెట్రోల్‌బంక్‌లో పెట్రోల్ పోయించడం, బైక్‌పై చక్కర్లు కొట్టే వీడియోలు జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.