మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, కొత్తగూడ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల రాళ్ల తిట్టే వాగు గత రెండు రోజులకు కురుస్తున్న వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తుంది.
వాగులో చేపల వేటకు వెళ్లిన ఆగబోయిన నరేష్(30) అనే యువకుడు వరద ఉధృతికి గల్లంతయ్యాడు. నరేష్ ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్తులు కలిసి గాలింపు చర్యలు ముమ్మరం. చేశారు. గాలింపు చర్యలను తహసీల్దార్ కే.రాజు దగ్గరుండి పర్యవేక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.