నెక్కొండ : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు సిద్ధపడగా పెద్దలు మూడు నెలల పాటు పెళ్లిని వాయిదా వేయడంతో యువకుడు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో జరిగింది.మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన ముడుసు సాయి (28 )శుక్రవారం ఉదయం ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నెక్కొండ ఎస్ఐ ఎం మహేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మూడుసు సాయి హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో దీక్షకుంట గ్రామానికి చెందిన ఓ యువతిని ఇష్టపడ్డాడు.
ఇరుపక్షాల పెద్ద మనుషులు పెళ్లి చేసేందుకు అంగీకరించినప్పటికి పెళ్లిని మూడు నెలల పాటు వాయిదా వేశారు. తన పెళ్లి లేట్ అవుతుందని సాయి భావించి క్షణికావేశంలో శుక్రవారం ఉదయంఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకున్న విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు హుటాహుటిన చికిత్స కోసం నర్సంపేటలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా సాయి దవాఖానలో మృతి చెందాడు. మృతిని తండ్రి నరసింహస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.