వరంగల్, ఆక్టోబర్ 6: చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వైభవంగా నిర్వ హించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు భద్ర కాళీ శేషు, ఈవో సునీత తెలిపారు. బుధవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో వారు ఉత్సవాల కరప్రతాలను అవిష్కరిం చారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ భద్ర కాళీ అలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైభవంగా నిర్వహి స్తామని అన్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మ వారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమి స్తారని ఆయన పేర్కొన్నారు. విజయదశమి రోజున కనులపండువగా తెప్పోత్సవం నిర్వహిస్తా మని తెలిపారు. ఈవో సునీత మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భద్రకా ళీ అమ్మవారికి సీఎం కేసీఆర్ బహూకరించిన బం గారం కిరీటం ఇతర కానుకలను శరన్నవరాత్రి ఉ త్సవాల సందర్భంగా అలంకరిస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని, తాగునీటి సౌక ర్యంతోపాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. సమావేశంలో అలయ సూపరింటెండెంట్లు అద్దంకి విజయ్‌కు మార్, హరినాథ్, అర్చకులు నాగరాజు శర్మ, రాము శర్మ, దత్తు శర్మ, ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.