హనుమకొండ, ఆగస్టు 8 : బీఆర్ఎస్ పాలనలో హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. పేదల సొంతిం టి కల నెరవేర్చాలనే సంకల్పంతో 2015లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర పర్యటన సందర్భంగా అంబేద్కర్‌నగర్, జితేందర్సింగ్నగర్ గుడిసెవాసులను ఖాళీ చేయించి అక్కడి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి వారికే ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఒక్కో బ్లాక్‌లో 16 చొప్పున మొత్తం 37 బ్లాక్‌లలో 592 ఇళ్లు నిర్మాణం 2019 వరకు పూర్తిచేశారు. అప్పటి పరిస్థితులు, వివిధ కారణాలతో ఇండ్ల పంపిణీ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీకి శ్రీకారం చుట్టిం ది.
అందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ ఇళ్లను ప్రారంభించి ముగ్గురి ఇళ్లలో పాలు పొంగించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 85 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎంపిక చేసిన 592మంది లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ పద్ధతిన కేటాయించి ప్రొసీడింగ్స్ అందజేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ‘బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించింది. కేసీఆర్ కట్టించిన ఇండ్లనే ఇప్పుడు మేం పంపిణీ చేస్తు న్నాం’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రా జేందర్‌రెడ్డి కార్యక్రమంలో చెప్పారు. కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఫొటోను మరిచారు. కార్యక్రమం మొదలయ్యే ముందు గుర్తించి చిన్న ఫొటోను తీసుకొచ్చి అంటించారు. రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వర్ధన్నపేట ఎమ్మె ల్యే కేఆర్ నాగరాజు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మం త్రిగా సంబోధించారు.కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహా శబరీష్, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకన్న, ఏనుగుల మానస పాల్గొన్నారు.
మేము 40 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. ఇంతకాలం మాకు ఇళ్లు ఇస్తాం అని ఆశ చూపి తీరా ఇపుడు జాబితాలో పేరు లేదని చెబుతున్నారంటూ మామడి బాబు, ఎరుకపల్లి అరుణ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఇండ్లు పంపిణీ చేసేందుకు వచ్చిన ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొన్నారని చెప్పారు. ‘కూలీనాలీ చేసుకొని బతికే మేము డబుల్ ఇండ్లకు అర్హులమేనని.. అయితే డబ్బులు ఇచ్చినోళ్ల పేర్లను లీడర్లు పెట్టారని లీడర్ల చుట్ట తిరిగినా మమ్మల పట్టించుకోలేదని వాపోయారు.
కొందరు లీడర్లు ఎవరి పేర్లు చెబితే వారికే ఇచ్చారని ఆగ్రహించిన పలువురు ఆందోళనకారులను ప్రెస్‌క్లబ్ వద్ద సుబేదారి పోలీసులు అడ్డుకొని తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత మరికొందరు లబ్ధిదారులు బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయిని క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు ఎమ్మెల్యేను కలువకుండా అడ్డుకోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. డబ్బులిచ్చినోళ్లకే ఇండ్లు ఇచ్చారని, అన్నింటినీ లీడర్లు అమ్ముకునున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు ఎందు కు ఇవ్వరని ప్రశ్నించారు. తమ కు డబుల్ బెడ్రూంలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.