కాశీబుగ్గ, నవంబర్8: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం సుమారు 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సి బ్బంది పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. పోలీసు అధికారుల ఉత్తర్వుల మేర కు శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్లో రెగ్యులర్ తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ ఫాం 2,3 వైపు రెండు ప్లాస్టిక్ సంచులు, రెండు ప్లాస్టిక్ బుట్టలతో అనుమానాస్పదంగా కన్పించ డంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా తలపాడు గ్రామానికి చెందిన బాబి త కుమారి పాణిగ్రహి ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా జగన్నాథపు రంలో ఉంటుంది.
ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బ్రహ్మపూర్ దంగపదర్ గ్రా మానికి చెందిన సంజుక్త బెహరా వారి వద్ద గల బ్యాగులను తనిఖీలు చేయగా 48కిలోల 24గ్రాముల ఎండు గంజాయి దొరికింది. వీరు ఇచ్చాపురం నుంచి సూరత్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, ఈ గంజాయి విలువ రూ.12 లక్షల 600 ఉంటుందని తెలిపారు. ఎస్సై జీ వెంకటేశ్వర్లు పంచనా మా చేసి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగాసీఐ పీ సురేందర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమో దు చేసి నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐపీఎఫ్ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ సిబ్బంది సార య్య, గురవయ్య, రాజు, జీఆర్పీ ఎస్సై మోయుద్దీన్, పీ రాజు, ఎం నాగరాజు,కే ప్రశాంతి, సీహెచ్ సుమలత పాల్గొన్నారు.