నల్లబెల్లి/నర్సంపేటరూరల్, డిసెంబర్ 27: మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 30న కృత్యమేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. నందిగామ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం జరిగిన మండలస్థాయి హెచ్ఎంల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని ప్రతి పాఠశాల నుంచి సృజనాత్మకతను పెంపొందించే బోధన, అభ్యసన సామగ్రిని (టీఎల్ఎం) ప్రదర్శించేందుకు తీసుకురావాలని సూచించారు. సమావేశంలో కాంప్లెక్స్ నోడల్ అధికారి ఏ రామచంద్రు, పున్నం యాకూబ్‌రెడ్డి, సతీశ్‌కుమార్, రాజేందర్, గోవర్ధన్, సుభాష్, ఈశ్వర్, రాజిరెడ్డి, వేణు, రవి, రాంబాబు, వెంకటయ్య, లక్ష్మీనర్సయ్య, రాజేశ్వరి, విజయ్ పాల్గొన్నారు. ఈ నెల 30న టీఎల్ఎం, ఎఫ్ఎల్ఎన్ కృత్యమేళా నిర్వహించనున్నట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ టీఎల్ఎం, ఎఫ్ఎల్ఎన్ మేళాను నర్సంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎగ్జిబిట్లతో హాజరు కావాలని కోరారు. ఆమె వెంట సీఆర్పీలు మర్ద శ్రీనివాస్, సునీల్, చంద్రమౌళి, భరత్ ఉన్నారు.
ఖానాపురం: మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మండలస్థాయి కృత్యమేళాను నిర్వహించనున్నట్లు నోడల్ అధికారి మంగ్యానాయక్ తెలిపారు. ఉదయం 9 గంటలకు కృత్యమేళా ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని ఒక ప్రకటనలో కోరారు.
గిర్మాజీపేట: టీఎల్‌ఎంతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని వరంగల్ మండల ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి గంపా అశోక్‌కుమార్ అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మండలస్థాయిలో టీచింగ్, లెర్నింగ్, మెటీరియల్ (టీఎల్ఎం) మేళా నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. టీఎల్ఎం మేళాలో ప్రతి సబ్జెక్టుకు ఐదు కృత్యాల చొప్పున నాలుగు సబ్జెక్టుల్లో 20 టీఎల్ఎంలను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో గెజిటెడ్ హెచ్ఎం రవికుమార్, డీపీసీ నర్సింహారావు, రఘునాయక్, జడ్జిమెంట్ కమిటీ సభ్యులు, నిర్వహణ కమిటీ సభ్యులు, సీఆర్పీలు పాల్గొన్నారు.