పెద్దవంగర/దేవరుప్పుల/కొడకండ్ల/పాలకుర్తి, ఫిబ్రవరి17 : సేవాలాల్ మహరాజ్ శ్రీరాముడితో సమానమని.., మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచదేశాలకు ఆదర్శమని, భవిష్యత్ తరాలకు కోసం వాటిని కాపాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో, జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో, పాలకుర్తి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా ముఖ్యనాయకుల సమావేశంతో సమావేశం నిర్వహించారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ప్రతి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు సంత్ సేవాలాల్ బోధనలు తెలుసు.. అందుకే ఆ మహనీయుడి జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు రూ. కోటి కేటాయించినట్లు తెలిపారు. సంత్‌సేవాలాల్ జయంతి పురస్కరించుకొని రాష్ట్రంలోనే మొట్టమొదటగా పాలకుర్తి నియోజకర్గంలో ఈ నెల 26న రూ.2కోట్ల నిధులతో ఎకరం స్థలంలో సేవాలాల్ మహరాజ్ ఆలయం, భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గిరిజన ప్రజలంతా పెద్దఎత్తున సంప్రదాయ పద్ధతిలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర నుంచి సేవాలాల్ ఆరాధ్య పండితులను ఆహ్వానించినట్లు తెలిపారు. సేవాలాల్ చరిత్రను గిరిజనులు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ బంజరాల అభివృద్ధి కోసం 3,146 తండాలను పంచాయతీలుగా గుర్తించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప నేతన్నారు. గిరిజనుల జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్న సంకల్పంతో మహిళలకు కుట్టు శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభించామని, త్వ రలో తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. శిక్షణ పూర్తయి ఉద్యోగం చేయాలన్న తపన ఉంటే వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగానే సామూహిక మినీ టెక్స్టైల్ పరిశ్రమలు స్థాపించాలనే ఉత్సాహం ఉంటే రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళకు ఆధునిక కుట్టు మిషన్ ప్రభు త్వం అందిస్తుందని తెలిపారు.
అనంతరం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సింగరాజుపల్లిలోని కుట్టు శిక్షణ కేంద్రంలో మహిళలు సంబురాలు జరుపుకోగా, మంత్రి ఎర్రబెల్లి కేక్‌కట్ చేశారు. పెద్దవంగరలో నియోజకవర్గ సేవాలాల్ మహరాజ్ కమిటీ నేతలు డాక్టర్ రవిరాథోడ్, రవీందర్‌నాయక్, వెంకన్ననాయక్, పటేల్నాయక్, మండల అధ్యక్షుడు ఐలయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు సుధీర్‌కుమార్, లింగమూర్తి, రాము, చంద్రశేఖర్, సమ్మయ్య, రాజేందర్, దేవేందర్, పాండు, దస్రు, దేవరుప్పులలో కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సర్పంచ్ గోపాల్‌దాస్ మల్లేశ్, డీఆర్ఎడీవో రాంరెడ్డి, పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మండల నాయకుడు సుందర్‌రాంరెడ్డి, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపసర్పంచ్ చినబుచ్చిరెడ్డి, ఐకేపీ ఏపీఎం వెంకట్‌రెడ్డి, సీసీ ఉమ, గ్రామ అధ్యక్షుడు నర్సింహులు, ఐకేపీ సీఏ స్వామి, గడ్డం రాజు, కొడకండ్లలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ధరావత్ జ్యోతి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మాభిక్షపతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మధుసూదన్, ఏఎంసీ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మం గ్యానాయక్, ప్రచార కార్యాదర్శి రమేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, యూత్ మండల అధ్యక్షుడు సతీశ్, నరేశ్‌నాయక్, మేకల రమేశ్, పాలకుర్తిలో కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాథోడ్, ఎంపీపీ నాగిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ యాకాంతరావు, మండల అధ్యక్షుడు నవీన్‌కుమార్, మాజీ జడ్పీటీసీ వాసూనాయక్, దేవానాయక్, బాలూనాయక్, జడ్పీకో-ఆప్షన్ సభ్యుడు మధార్, యాకూబ్‌నాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.