మెరుగైన సేవల కోసమే ధరణి పోర్టల్

- అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి
చెన్నారావుపేట, జనవరి 23: రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ధరణి ప్రక్రియ ఎలా కొనసాగుతున్నదని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్‌ను అడిగారు. మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్న గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగేలా ప్రభుత్వం ధరణి ప్రక్రియను రూపొందించిందన్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, మ్యుటేషన్ల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, మీసేవలో నిర్ణీత ఫీజు చెల్లించి భూ యాజమాన్య హక్కుపత్రాలు పొందవచ్చని సూచించారు. అనంతరం భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి పత్రాలు అందించారు.
స్లాట్ బుకింగ్‌లో పొరపాట్లు..
శంకరంతండాకు చెందిన భూక్యా ద్వాలికి చెందిన 5.12 ఎకరాల భూమికి ప్రభుత్వం 2018లో పట్టాదారు పాస్‌పుస్తకం ఇచ్చింది. ఆమె లింగగిరికి చెందిన మహ్మద్ అఫ్జల్ పాషాకు రెండేళ్ల క్రితం అందులో నుంచి 1.12 ఎకరాల భూమిని విక్రయించింది. గత డిసెంబర్ 12న స్లాట్ బుక్ చేసింది. స్లాట్‌లో ఆధార్ నంబర్, ఫొ టో తప్పుగా నమోదైంది. ఆమె బయోమెట్రిక్‌ను పరిశీలిస్తే ఆధార్ వివరాలు తప్పుగా ఉండడం మూలంగా తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని విచారించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. మహేందర్‌రెడ్డి వెంట నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, డీటీ మధుసూదన్, గిర్ధావర్ స్వామి, ధరణి ఆపరేటర్లు సుధీర్‌కుమార్, సామ్రాట్ ఉన్నారు.
తాజావార్తలు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్‌షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్‌నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు