సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Jan 07, 2021 , 02:50:45

కుష్ఠు వ్యాధి నివారణే ప్రభుత్వ లక్ష్యం

కుష్ఠు వ్యాధి నివారణే ప్రభుత్వ లక్ష్యం

దామెర/శాయంపేట, జనవరి 6 : కుష్ఠు వ్యాధి నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర లెప్రసీ నివారణ బృందం సభ్యులు, జేడీ డాక్టర్‌ జాన్‌బాబు అన్నారు. బుధవారం దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు శాయంపేట పీహెచ్‌సీని  రాష్ట్ర కుష్ఠువ్యాధి నివారణ బృందం సభ్యులు సందర్శించారు. రోగులకు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఒంటిపై తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సంతోషీలత, డాక్టర్‌ కమల్‌చంద్‌ నాయక్‌, డాక్టర్‌ నాగశశికాంత్‌, ఫిజియోథెరపిస్టు నర్సింహారెడ్డి, డీపీఎంవోలు శ్రీదేవి, దేవిక,  ఏపీఎంవోలు శ్రీనివాస్‌,  మధుబాబు, లూథరమ్మ, నోడల్‌ అధికారి ఎం చలపతి, పీవో డాక్టర్‌ రామకృష్ణ, హెచ్‌ఈవో అశోక్‌బాబు, సూపర్‌వైజర్లు శ్రీకాంత్‌, భాగ్యలక్ష్మి, ఫార్మాసిస్ట్‌ శివకుమార్‌, కరుణ, మౌనిక పాల్గొన్నారు.


logo