పల్లెప్రగతిని నిరంతరం కొనసాగించాలి

- అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యం
- కలెక్టర్ ముండ్రాతి హరిత
- పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
దుగ్గొండి, డిసెంబర్ 29: పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ముండ్రాతి హరిత అన్నారు. మండలంలోని చాపలబండ, రంగాపురం, రాజ్యాతండాలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యం గా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామస్తుల సహకారంతో పల్లెలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నా రు. స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు ఆధారంగానే గ్రా మాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు వస్తాయన్నారు. సంక్షే మ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. విధులపై అలసత్యం వహించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌కుమార్, ఎంపీడీవో పల్లవి, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు కొండం రమాదేవి-విజేందర్‌రెడ్డి, ఏడెల్లి రజిత-ఉమేశ్‌రెడ్డి, రవీందర్‌నాయక్, కార్యదర్శులు పాల్గొన్నారు.
యార్డులను వినియోగంలోకి రావాలి
కలెక్టరేట్: జిల్లాలో డంపింగ్ యార్డులన్నీ పూర్తిగా వినియోగంలోకి రావాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పల్లెప్రగతి పనుల పురోగతిపై ఎంపీడీవో, ఎంపీవోలతో సమీక్షించారు. మండల సమాఖ్య సమావేశంలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై ఎజెండాలో పెట్టి అవగాహన కల్పించాలన్నారు. నర్సరీల వద్ద వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. ఐదు మండలాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఐహెచ్హెచ్ఎల్ ఫస్ట్ ఫొటో పెండింగ్ ఉండొద్దన్నారు. ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెరగాలన్నారు. కల్లాల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని అధికారులకు సూచించారు. డీఎల్పీవోలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో పీడీ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్‌ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి