గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Nov 27, 2020 , 01:59:25

ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నల్లబెల్లి, నవంబర్‌26: ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమా ర్‌ అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కొనసాగుతున్న ధరణి సేవలను ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్‌తో  అరగంటలో భూమి రిజిస్ట్రేషన్‌ అవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా మేడపల్లి, కన్నారావుపేట పరిధిలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన కెనాల్‌ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో జాప్యమైన కొందరు రైతుల భూముల వివరాలను ఆర్డీవో పరిశీలించారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ను పరిశీలించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గుండు వివేక్‌, కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు. 

తాజావార్తలు


logo