శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jul 31, 2020 , 00:55:43

వన్‌టైం సెటిల్‌మెంట్‌తో పన్ను చెల్లింపుదారులకు ఊరట

వన్‌టైం సెటిల్‌మెంట్‌తో పన్ను చెల్లింపుదారులకు ఊరట

  • వడ్డీలో 90 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
  • ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ప్రత్యేక డ్రైవ్‌
  • పరకాల పట్టణంలో రూ. 1.25 కోట్ల  పన్ను బకాయిలు
  • 7804 మందికి చేకూరనున్న లబ్ధి

పరకాల టౌన్‌ : మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఆస్తి పన్ను చెల్లింపులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చ ర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగం గా బకాయి పడ్డ ఆస్తి పన్ను చెల్లించే వారికి రాయితీ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేసుకునేందుకు ముం దుకు వచ్చిన బకాయిదారులకు వడ్డీలో 90 శాతం తగ్గించనుంది. వన్‌టైం సెటిల్‌మెంట్ల కోసం 45 రోజులపాటు మున్సిపాలిటీల్లో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. 2019-20వ ఆర్థిక సంవత్స రం చివరి నాటికి పేరుకుపోయిన ఆస్తి ప న్నును ఒకేసారి కడితే వడ్డీలో 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర కు మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు జీవో నంబర్‌ 306 జారీ చేశారు. 

రూ. 1.25 కోట్ల బకాయిలు..

పరకాల మున్సిపాలిటీలో 6,580 నివా స ఆస్తులు, 718 వాణిజ్య ఆస్తులు, 457 వాణిజ్య, నివాస రెండూ కలిసి ఉన్న ఆస్తు లు ఉన్నాయి. వీటిలో మొత్తం రూ. 94.47 లక్షల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నా యి. ప్రభుత్వానికి చెందిన 49 ఆస్తుల్లో రూ. 30.86 లక్షలు పెండింగ్‌ ఉన్నాయి. పట్టణ పరిధిలోని 22 వార్డుల్లో 7,804 ఆస్తులు ఉండగా రూ. 1,25,33,000 బ కాయిలు ఉన్నాయి. బకాయిలను చెల్లించేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15 వ తేదీ వరకు 45 రోజుల పాటు ము న్సిపాలిటీ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నులు చెల్లించక వడ్డీ భారం మోస్తున్న వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించనుంది.

ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి..


ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులో 90 శాతం వడ్డీ రాయితీ స్కీం బకాయిదారులకు ఊరటనిస్తుంది. దీంతో వడ్డీ భారం తగ్గడంతో ప్రజలు బకాయి పన్నులు చెల్లించే అవకాశం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పట్టణంలో వేల మందికి లబ్ధి చేకూరుతుంది. 

రేగూరి విజయ్‌పాల్‌ రెడ్డి,  మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, పరకాల

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి


బకాయిల పడ్డ పన్ను చెల్లింపుదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను ఏకమొత్తంలో చెల్లించినట్లయితే వడ్డీలో 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక డ్రైవ్‌ 45 రోజులు మాత్రమే ఉంటుంది. బకాయి పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
బీ యాదగిరి, కమిషనర్‌, పరకాల మున్సిపాలిటీ


logo