ముగిసిన నామినేషన్ల పరిశీలన

వరంగల్‌రూరల్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ : సహకార ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే నా మినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. కేవలం ఉపసంహరణ మిగిలి ఉంది. నామినేషన్ల విత్‌డ్రా గడువుకు సోమవారం తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు సమయం ఉంది. సహకార ఎన్నికల నిర్వహణకు ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం(పీఏసీఎస్) కార్యాలయంలో 6 నుంచి 8వ తేదీ వరకు ఎ న్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. జిల్లాలో సహకార ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల పరిధిలోని 402 ప్రాథేశిక నియోజకవర్గా(టీసీ)ల్లో 1,564 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు. మూడు రోజుల్లో అత్యధికంగా ఆఖరిరోజు శనివారం 1,045 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. అభ్యర్థుల నుం చి అందిన 1,564 నామినేషన్లను ఎలక్షన్ అధికారు(ఈవో)లు ఆదివారం పరిశీలించారు. ఆయా పీఏసీఎస్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్క్రూటినీ చేశారు. అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటల తర్వాత పీఏసీఎస్ ఆఫీసు బోర్డుపై ప్రదర్శించారు. సో మవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులకు అదేరోజు గుర్తులు కేటాయిస్తారు. పోటీ నెలకొన్న ప్రతి టీసీలో ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం అదేరోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.
టీఆర్ఎస్ నజర్..
సహకార ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. తమ పార్టీ మద్దతుతో బరిలో దిగుతున్న అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రైతుల మద్దతు గల అభ్యర్థులను గుర్తించి తమ పార్టీ సపోర్టును ప్రకటించే దిశలో గులాబీ ముఖ్యనేతలు ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు పీఏసీఎస్ వారీగా పార్టీ నుంచి సహకార ఎన్నికల ఇన్చార్జీలను నియమించారు. వీరికితోడు పార్టీ నేతల్లో కొందరితో ప్ర త్యేకంగా ఎన్నికల కమిటీలను కూడా వేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఆశిస్తున్న అభ్యర్థుల్లో పార్టీ నుంచి ఎవరికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలనేది ఇన్చార్జీలు, ఎన్నికల కమిటీల్లోని సభ్యులు స్థానిక గులాబీ శ్రేణులతో మాట్లాడి ఎంపిక చేసిన జాబితాను స్థానిక ఎమ్మెల్యేకు అందజేస్తున్నారు. పరిశీలించి గెలుపే లక్ష్యం గా అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అంశంపై ఎమ్మెల్యేలు తుది నిర్ణ యం తీసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ మొదలు కావటానికి ముందు నుంచి ఈ కసరత్తు జరుగుతుంది. ఎమ్మెల్యేలు తమ పార్టీ ఎన్నికల ఇన్చార్జీలు, కమిటీలతో ఎప్పటికప్పుడూ మాట్లాడుతూ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. నామినేష న్ల దాఖలు గడువు ముగిసిన శనివారం వరకు మెజార్టీ టీసీల్లో టీఆర్ఎస్ మద్దతు పొందే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. ఎం దుకంటే ఆయా పీఏసీఎస్ చైర్మన్ పదవికి రేసులో ఉన్న ఆశావహుల్లో స్థానిక ఎమ్మెల్యే నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన వారే నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల చొరవతో పలు టీసీల్లో సిం గిల్ నామినేషన్ దాఖలు కావడం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసిపోనున్నందున టీఆర్ఎస్ మద్దతు కోరుతూ పీఏసీఎస్‌ల పరిధిలోని వివిధ టీసీల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులతో మాట్లాడి ఒకరు మాత్రమే బరిలో ఉండేలా ఆదివారం ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాయపర్తి మండల కేంద్రంలో ఈ మండలంలోని టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఆయా పీఏసీఎస్ పరిధిలోని టీసీల్లో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఎవరెవ రూ టీఆర్ఎస్ మద్దతు కోరుతున్నారు, ఎవరికి మద్దతు తెలపాలనే అంశంపై ఆయన చర్చించారు. ఆయా టీసీలో టీఆర్ఎస్ మద్దతుతో ఒకరు మాత్రమే పోటీలో ఉండాలని, ఆ ఒకరిని స్థా నిక టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నిర్ణయిస్తాయని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పార్టీలో ఎవరైనా నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని దయాకర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్నందున సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాయపర్తి, కొలన్‌పల్లి పీఏసీఎస్‌ల పరిధిలోని 26 టీసీల్లో టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగే అభ్యర్థుల ఖరారుపై మంత్రి పార్టీ ముఖ్యనేతలకు సూచనలు చేశారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం తమ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ము ఖ్యనేతలతో సమావేశమై సహకార ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారుల గెలుపునకు దిశానిర్దేశం చేశారు.
కొన్ని నామినేషన్ల రిజక్ట్..
జిల్లాలోని 32 పీఏసీఎస్‌ల్లో సంగెం పీఏసీఎస్ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు వరకు ఉన్నందున మిగత 31 పీఏసీఎస్‌ల్లో సహకార ఎన్నికల నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చా రు. ప్రతి పీఏసీఎస్ పరిధిలో 13 టీసీలు ఉన్నందున 31 పీఏసీఎస్‌ల పరిధిలోని 403 టీసీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా పీఏసీఎస్ పరిధిలో టీసీ వారీగా ఓటర్లు, రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 3న ఉ దయం ప్రకటించారు. ప్రతి పీఏసీఎస్‌లోని 13 టీసీల్లో 1 ఎస్సీ, 1 ఎస్సీ మహిళ, 1 ఎస్టీ, 2 బీసీలు, 1 ఓపెన్ కేటగిరి(ఓసీ) మ హిళ, 7 ఓసీలకు కేటాయించినట్లు పేర్కొంటూ రిజర్వేషన్ల వివరాలను టీసీ వారీగా ఎన్నికల నోటిఫికేషన్లో తెలిపారు. గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల పీఏసీఎస్ పరిధిలో ఎస్టీ ఓట ర్లు లేకపోవడం వల్ల ఇక్కడ ఒక టీసీలో ఎన్నికలు నిర్వహించటం లేదని ఎలక్షన్ అధికారి స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల పరిధిలో 402 టీసీల నుంచి ఎలక్షన్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పోటీ అధికంగా ఉన్న పలు టీసీల్లో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో అంచనాలకు మించి 1,564 నామినేషన్లు వచ్చినట్లు తె లిపారు. పరకాల పీఏసీఎస్ పరిధిలోని 1వ టీసీలో అత్యధికం గా 19 నామినేషన్లు దాఖలు కావడాన్ని పరిశీలిస్తే సహకార ఎ న్నికల్లో పోటీ తీవ్రత అవగతమవుతుంది. పరిశీలనలో కొందరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో వివిధ పీఏసీఎస్‌ల పరిధిలోని కొన్ని టీసీల్లో అభ్యర్థులెవరు మిగలలేదు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి పీఏసీఎస్ పరిధిలోని మూ డు టీసీల్లో ఇదే జరిగింది. ఇక్కడ 1, 2వ నంబర్ టీసీల్లో ముగ్గు రు, 9వ నంబర్ టీసీలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వివిధ కారణాల వల్ల వీరి నామినేషన్లు రిజక్ట్ కావడంతో ఈ మూడు టీసీల్లో ప్రస్తుతం ఎన్నికలకు పుల్‌స్టాప్ పడింది. సిం గిల్ నామినేషన్ దాఖలైన, స్క్రూట్నీ తర్వాత ఒకే నామినేషన్ మిగిలిన టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పరిశీలనలో 164 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు చెప్పారు. మొత్తంగా 1400 నామినేషన్లు అర్హత పొందినట్లు ప్రకటించారు.
తాజావార్తలు
- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
- ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
- కేటీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతారు
- సైదన్న జాతర సమాప్తం
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన
- మార్క్‌ఫెడ్ ఫెడరేషన్ ఎండీగా యాదిరెడ్డి