INAVOLU | హనుమకొండ (ఐనవోలు): అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లును పట్టుకున్నట్లుగా ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. మండంలోని నందనం ఆకేరు వాగు నుంచి ఎటువంటి అనమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించిగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించిన్నట్లుగా పేర్కొన్నారు. డ్రైవర్లు, ఓనర్ల పైన కేసు నమోదు చేసిన్నట్లుగా తెలిపారు. నాయకుల పైరవీలతో పట్టుకున్న కొన్ని ఇసుక ట్రాక్టర్లును కేసు చేయకుండానే విడిచిపెట్టిన్నట్లుగా ఇసుక ట్రాకర్లు యజమానులు ఆవేదన వ్యక్తిం చేస్తున్నారు.