స్వరాష్ట్రం రాక ముందే పథకం ఏర్పాటుకు బాటలు
గత బడ్జెట్లోనే వెయ్యి కోట్లు కేటాయింపు
ఖాతాల్లోని డబ్బులను వెనక్కి తీసుకుంటారనేది తప్పుడు ప్రచారం
ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దు
ప్రతిపక్ష పార్టీల తీరు మారాలి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కరీంనగర్, అక్టోబర్ 7 (కరీంనగర్ ప్రతినిధి): దళిత బంధు ఎన్నికల కోసం పుట్టింది కాదని, స్వరాష్ట్రం ఏర్పడక ముందే పథకాB నికి బాటలు పడ్డాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో యినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని శ్వేత హోటల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, లేవనెత్తుతున్న అనుమానాలపై స్పష్టత ఇస్తూనే, ఇలా ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దని సూచించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే పథకంపై వీలైతే సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప తప్పుడు ప్రచారం తగదని హితవుపలికారు.
ఎన్నికల కోసం పుట్టింది కాదు
దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసం మాత్రమే పుట్టిదం టూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నా రు. స్వరాష్ట్రం ఏర్పడక ముందే.. తెలంగాణలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులతో పాటుగా విద్యుత్, సాటునీటి రంగం, చెరువులు, కుంటలు అలాగే వివిధ సామాజికవర్గాల స్థితి గతులపై సదస్సులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక్కో సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చో ఆనాటి సభలు, సమావే శాల్లోనే నిర్ణయాలు జరిగినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే దళిత సామాజికవర్గంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాల వంటి అంశాలపై 2002 ఆగస్టు 11న హైదరాబాద్ గ్రీన్‌పార్కు హోటల్లో రెండు రోజుల పాటు సదస్సు జరిగిందని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు, కేటాయింపుల వంటి అంశా లపై లోతుగా అధ్యయనం చేసిన ఆనాటి సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణన్‌తో పాటుగా అంబేద్కర్ మనుమడిని సైతం ఈ సదస్సుకు ఆహ్వానించిన విషయాన్ని, అనేక మంది మేధావులు ఈ సదస్సులో పాల్గొని విలువైన సూచనలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగమే నేటి దళిత బంధు పథకమన్నారు. గత బడ్జెట్లో దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద రూ. 1000 కోట్లను కేటా యించిన విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు. దీనిని బట్టి ఇది హుజూరాబాద్ ఎన్నికల కోసం పెట్టిన పథకం కాదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.
విజ్ఞానం లేకుండా మాట్లాతున్నరు..
“దళిత బంధు పథకం ఆనాడే రూపకల్పన జరిగితే ఇన్నాళ్లూ సమయం ఎందుకు పట్టిందంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఏ మాత్రం విజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ముందుగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతో మనకున్న ఆర్థిక వనరుల మేరకు.. కాళేశ్వరంతో పాటుగా అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేసుకున్నాం. మిషన్ భగీరథ కింద చెరువులు కుంటల నిర్మాణాలు పూర్తిచేసాం. అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న అది పెద్ద విద్యుత్ సమస్యను పరి ష్కరించుకున్నాం. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం వల్ల పేరుకుపోయిన అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాం. అందుకే ఆ సమయంలో దళిత బంధు పథకం అమలు చే యలేదు. ప్రస్తుతం దాదాపు ప్రధాన సమస్యలు పరిష్కారమ య్యాయి. అందుకే దళిత సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే పథకాన్ని అమల్లోకి తెచ్చాం ” అని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారాన్ని ఆపాలి..
దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత సమాజాన్ని బాగుచేయ డానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దళిత బంధు పథకాన్ని అమల్లోకి తీసుకొస్తే.. సహకరించాల్సిన ప్రతిపక్షాలు అవాస్తపు ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన డబ్బులను మళ్లీ వెనక్కి తీసుకుంటారని.. ఎన్నిక పూర్తయ్యాక పథకం ఎత్తి వేస్తారని.. మిగిలిన లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వరని.. అంతేకాదు.. అనేక షరతులు పెట్టి డబ్బులు వినియోగం కాకుండా చూస్తారని.. లబ్ధిదారులకు ఇష్టంలేని పథకాలను గ్రౌం డింగ్ చేయిస్తారంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడైనా ఒక లబ్ధి దారుడి ఖాతాలో డబ్బులు వేసిన తర్వాత తిరిగి తీసుకునే అధికారం ఇతరులకు ఉంటుందా? లబ్ధిదారుడి అనుమతి లేకుండా ఇతరులకు బదిలీచేసే అవకాశం ఉంటుందా? ఖాతాల్లో నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడానికి చట్టాలు ఒప్పుకుంటాయా..? ఆరోపణలు చేసే ప్రతిపక్ష నాయకులు ముందుగా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రిగా చేసిన రాజేందర్‌కు బ్యాంకు ఖాతా లావాదేవీల గురించి బాగా తెలుసునని, కానీ ఓట్ల కోసం అన్నీ మరిచి.. ఇలా తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
వీలైతే సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప ఒక మంచి ఆశయంతో అమలు చేస్తున్న పథకాన్ని అసత్య ప్రచారాలతో అబాసు పాలు చేసే ప్రయత్నాలు చేయవద్దని హితవుపలికారు. అంతేకాదు ఏ పథకం ప్రవేశపెట్టినా బదనాం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయ త్నించాయన్నారు. రైతు బంధు, రైతు భీమా, గొర్రెల పంపిణీ, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, ఆసరా ఫించన్లు వంటివి అమలు కావని ఎద్దేవా చేశారు. కానీ సీఎం కేసీఆర్ వాటిని అమలుచేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం దళిత బంధు విష యంలోనూ ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. లబ్ధిదారులు మాత్రం సీఎంపై అపార నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్ప టివరకు ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని దిగ్విజయంగా అమలుచేసిన కేసీఆర్ ఈ పథకాన్ని హుజూరాబాద్‌లోనే కాదు.. అన్ని ప్రాంతా ల్లోనూ దశల వారీగా అమలుచేస్తారని పేర్కొన్నారు. టఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసిన విషయాన్ని అందరూ గుర్తించాలని సూచించారు. ఇకనైనా ప్రతి పక్షాల తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వినోద్‌కుమార్‌తో పాటుగా సమావేశంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.