ఖానాపురం, ఆగస్టు 9 : మండలంలోని ఉమ్మడి మంగళవారిపేట గ్రామపంచాయతీ భూములకు వక్ఫ్ బోర్డు అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం అఖిలపక్ష కమిటీ నాయకులతో కలిసి ఏటూరునాగారంలో ఐటీడీఏ పీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మంగళవారిపేట గ్రామంలో వంద సంవత్సరాలకు పైగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. మంగళవారిపేట గ్రామం 1/70 చట్టం కింద ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించబడిందన్నారు. సర్వేనంబర్ 22/19లో 24,00 ఎకరాల భూమిని గిరిజన రైతులు సాగుచేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. బీటీ రోడ్లు, ఉపాధ్యాయ పోస్టులు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారని వివరించారు. కానీ, ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు సభ్యులు వ్యవసాయ భూము లు, గ్రామాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీవో మా ట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లుగౌడ్, అఖిలపక్షం కమిటీ అధ్యక్షుడు గొంది నాగేశ్వర్రావు, సర్పంచ్‌లు బాదావత్ బాలకిషన్, గుగులోత్ సుమన్, భూక్యా పద్మ, గుగులోత్ కిషన్‌నాయక్, లావుడ్యా రమేశ్ నాయక్, అశోక్, ఎంపీటీసీ మూడు పూల్‌సింగ్ పాల్గొన్నారు.