ఖిలావరంగల్, నవంబర్ 01: జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కరోనా వ్యాక్సినేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీకా వేయించుకోని కుటుంబాలను గ్రామాల్లో గుర్తించాలన్నారు. అందరూ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ పీడీ, డీహెహెచ్ఓ, జెడ్పీ సీఈఓతోపాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ సెల్‌కు దరఖాస్తులు
జిల్లాలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు దరఖాస్తుల, వినతి పత్రాలు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బీ గోపి అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితా పోలింగ్ స్టేషన్లలో..
ముసాయిదా ఓటరు జాబితా 2022 అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.