నల్లబెల్లి, అక్టోబర్ 10:అధిక దిగుబడితోపాటు అత్యంత లాభసాటి పంట డ్రాగన్ ఫ్రూట్.. దీనికి మార్కెట్లో మాంచి డిమాండ్ ఉంది. అధిక పోషకాలతోపాటు ధర కూడా ఎక్కువగానే ఉంటోంది. పంట కాలపరిమితి 25-30 ఏళ్లు కాగా, మూడేళ్లు దాటితే ఎకరాకు 12 టన్నుల దిగుమతి వస్తున్నది. ఇందులో అంతర పంటలనూ వేసుకోవచ్చు. మార్కెట్లో లీటర్ జ్యూస్‌కు రూ. 1500 పలుకుతోంది. దీంతోపాటుతెలంగా ణ రాష్ట్రంలోని భూములు అనుకూలం కావడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పంటను వరంగ ల్ జిల్లాలో విస్తరించేందుకు ఉద్యాన వన శాఖ చర్యలు చేపడుతోంది.
వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా నల్లబెల్లి మండలంలోని దస్తగిరిపల్లె గ్రామానికి చెందిన రైతు శేఖరా చారి అర్శనపెల్లి శివారులో మూడెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేశాడు. మొదట పెట్టుబడి ఎకరాకు రూ. ఆరు లక్షల ఖర్చుతో పంట సాగు చేయగా, ఎనిమిది నెలలకే పంట చేతి కందింది. పది క్వింటాళ్ల డ్రాగన్ ప్రూట్స్ పండగా, కిలోకు రూ. 250 చొప్పున రెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చాయి. అలాగే రెండో క్రాప్‌కు 3 టన్నులు, మూడో క్రాప్‌కు ఆరు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు అంచనా వేస్తున్నాడు. మొదటి పెట్టుబడి మినహా ఎలాంటి ఖర్చు లేదు. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది కాబట్టి అంతరపంటగా ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు నాటాడు. అలాగే ఆసక్తి గల రైతులకు డ్రాగన్ ప్రూట్ మొక్కలను సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశాడు.
సాగు విధానం..
డ్రాగన్ ప్రూట్ మొక్క నాగజెముడు, బ్రహ్మజెముడు జాతికి చెందినది. కాబట్టి పావు ఎకరం వరి పంటకు అందించే నీటితో ఒక ఏడాది డ్రాగన్ ఫ్రూట్ పంటకు సాగు నీరందించవచ్చు. మార్కెట్లో 150 రకాల డ్రాగన్ ప్రూట్ మొక్కలు లభిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రోజ్ కలర్ రకం ఎక్కువ గా సాగు చేస్తున్నారు. ఎకరం భూమిలో సాగుకు సుమారు రూ. ఆరు లక్షలు ఖర్చవుతుంది. ఇందుకు 500 సిమెంట్ పోల్స్ కావాలి. వీటిపై భాగంలో సిమెంట్ ప్లేట్స్ గాని లేదా పాత టైర్లు గాని వాడవచ్చు. ఒక్కో పోల్‌కు నాలుగు వైపులా నాలుగు డ్రాగన్ మొక్కలు నాటాలి. మొక్కకు మొక్కకు మధ్య ఎనిమి దడుగుల వ్యత్యాసం ఉండాలి. రెండువేల మొక్కలు అవసరమవుతాయి. మార్కెట్లో ఒక్కో మొక్కకు రూ.70కి అందుబాటులో ఉన్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. నాటిన మొక్కకు మూడు నుంచి నాలుగు రోజులకోమారు డ్రిప్ సిస్టం ద్వారా నీటిని అందివ్వాలి. డ్రాగన్ మొక్క ఎదుగుదలకు పెంట, వర్మికంపోస్టు, జీవామృతం అవసరం ఉంటుంది. ఈ మొక్కకు పూర్తిగా పొడవాటి ముళ్ల ఉన్నందు న కోతుల బెడద ఉండదు. సాగుకు ఎర్రగరప నేలలు, రాగడి నేలలు అనువైనవి. డ్రాగన్ ప్రూట్ పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. కేవలం గండుచీమలు, ఎర్రచీమలు పడితే వీటి నివారణకు నీమ్ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది.
డ్రాగన్ ప్రూట్ ఉపయోగాలు..
డ్రాగన్ ప్రూట్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. పిల్లల్లో పోషక విలువలు వృద్ధి చెందడం, డయా బెటిస్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ తగ్గించడంతోపాటు ప్లేట్లెట్స్ వృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఇందులో యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే గుణం ఉన్నందున మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.
జిల్లాలో విస్తరించేందుకు చర్యలు
డ్రాగన్ ప్రూట్ సాగును వరంగల్ జిల్లాలో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆసక్తి గల రైతు లకు సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేస్తాం. బ్యాంకుల ద్వారా ప్రత్యేక రుణం అందించేలా చూస్తాం. తెలంగా ణ రాష్ట్రంలోని భూములు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనువైనవి. ఉద్యానవన శాఖ ద్వారా అవగాహన కల్పి స్తున్నాం. లాభసాటిగా ఉండే ఆరుతడి పంటలను రైతులు సాగు చేయడం శుభపరిణామం. ప్రపంచ మార్కెట్లో పోషక విలువలు కలిగిన డ్రాగన్ ఫ్రూట్‌కు మంచి డిమాండ్.