నర్సంపేట, సెప్టెంబర్ 20 : నర్సంపేట అంగడి సెంటర్లోని రైతు బజార్లో సోమవారం ఉదయం గ్రంథాలయ డైరెక్టర్ గంపరాజేశ్వర్రావు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ కమిషనర్ విద్యాదర్, జూనియర్ అకౌం ట్ అధికారి ఏ రజిని, సంగెపు శ్రీధర్ నాగరాజు, ఆర్పీ అనురాధ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్
నర్సంపేట రూరల్: మండలంలోని లక్నెపల్లిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ను సర్పంచ్మ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, వార్డు సభ్యులు పరిశీలించారు.
సబ్సెంటర్లో మాస్కుల పంపిణీ
మండలంలోని లక్నెపల్లి గ్రామ సబ్ సెంటర్లో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సమితి అందజేసిన మాస్కులను సర్పంచ్ గొడిశాల రాంబాబు, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వలంటీర్ బెజ్జంకి ప్రభాకర్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు సుజాత, యాకలక్ష్మి, ఆశ కార్యకర్తలు కొడారి కవిత, కల్పన, రమాదేవి, వీ. కవిత పాల్గొన్నారు.
నెక్కొండలో..
నెక్కొండ : మండలంలోని తోపనపల్లిలో వ్యాక్సినేషన్‌ను పీవో మధుసూదన్ పరిశీలించారు. వైద్యాధికారి సుమంత్, సర్పంచ్ ఎండీ ఫకీర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి ఖాదర్‌పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి అన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లత, పంచాయతీ కార్యదర్శి వీరన్న, ఆశలు సమ్మక్క, శారద, పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: మండలంలోని బండమీది మామిడితండాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలో 750 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి అరుణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ బాలరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి: మండల కేంద్రంలోని పీహెచ్సీలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్ పరిశీలించారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్‌లో..
పోచమ్మమైదాన్: వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను వరంగల్ అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధార్‌సింగ్ సోమవారం సందర్శించారు. అర్బన్ హెల్త్ సెంటర్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తంగళ్ళపల్లి భరత్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా 21వ డివిజన్ ఎల్బీనగర్లోని రయాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్ సందర్శించారు.
గీసుగొండలో..
గీసుగొండ: మండల కేంద్రంలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ను వైద్యాధికారి మాధవీలత పరిశీలించారు. ఆమె వెంట సీహెచ్ మధుసూదన్, సూపర్వైజర్ కిరణ్‌కుమార్ ఉన్నారు.
కరీమాబాద్‌లో..
కరీమాబాద్: అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నా రు. 40వ డివిజన్ ఉర్సు సీఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్‌తో కరోనాను అరికట్టొచ్చని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్ల రవి, నాయకులు వొగిలిశెట్టి అనిల్‌కుమార్, కార్పొరేషన్ సిబ్బంది, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని రావూరులో పలువురు గ్రామస్తులు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు.
సంగెంలో..
సంగెం : వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పల్లార్గూడ సర్పంచ్ కక్కెర్ల కుమారస్వామి అన్నారు. గ్రామంలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఆశవర్కర్లు పాల్గొన్నారు.