నర్సంపేట, ఆగస్టు 6: గ్రీన్‌సిటీగా నర్సంపేట పట్టణాన్ని మార్చాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో రూ. 20 లక్షలతో చేపట్టిన సెంటర్ డివైడర్లలో ఎర్రమట్టి పోసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణాన్ని రూ. 35 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, కమిషనర్ విద్యాధర్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టెక్స్టైల్ పార్కు ఓఎస్డీ డాక్టర్ శాంత, శాంతిస్వరూప్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
నర్సంపేట: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆయన మొక్క నాటారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్‌చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, డాక్టర్ గోపాల్, మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, శ్రీరాం ఈశ్వరయ్య, శింగిరికొండ మాధవశంకర్, ఇరుకు కోటేశ్వర్రావు, రాయిడి రవీందర్‌రెడ్డి, బండి చింటు, కౌన్సిలర్లు కీర్తిదుష్యంత్రెడ్డి, గంప సునీత, నాగిశెట్టి పద్మప్రసాద్, అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని పెద్దికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలంగాణ ఆటో యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు కల్లెపెల్లి సురేశ్ అధ్వర్యంలో మదర్సా పిల్లల మధ్య పెద్ది పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, తడిగొప్పుల మల్లేశ్, ఎస్కే వసీం, కొమ్ము వినయ్, రాజు పాల్గొన్నారు.
దుగ్గొండి: గిర్నిబావిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. మందపల్లి పీఏసీఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎన్నారై రాజ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఉమేశ్‌రెడ్డి, రంగారావు, కార్తీక్, విద్యాసాగర్, బాలకృష్ణ, రవీందర్‌నాయక్, రాజేశ్ పాల్గొన్నారు.
నెక్కొండ: పెద్ది పుట్టిన రోజు సందర్భంగా ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్‌రావు, పెద్దకోర్పోలు సర్పంచ్ మహబూబ్‌పాషా, దీక్షకుంట సర్పంచ్ సురేందర్, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, సత్యం, సారంగపాణి, యాకయ్య, వెంకటేశ్వర్లు, భిక్షపతి, రాజు, సురేశ్, ఎంపీటీసీ అజయ్, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, రాకేశ్ పాల్గొన్నారు.