నమస్తే తెలంగాణ నెట్వర్క్ : జిల్లా వ్యాప్తంగా జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. వర్ధన్నపేట మండలంలోని చెన్నారంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పాల్గొని జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పునుగోటి భాస్కర్‌రావు, మండల వెటర్నరీ అధికారి రాజేందర్, ఉప సర్పంచ్ రాజమౌళి పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని జల్లి, ఖాదర్‌పేట, ఉప్పరపల్లి గ్రామాల్లో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బదావత్ విజేందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశు వైద్యాధికారి మంజీలాల్, జల్లి ఇన్చార్జి సర్పంచ్ గరిగె సతీశ్, ఖాదర్‌పేట, ఉప్పరపల్లి సర్పంచ్‌లు అనుముల కుమారస్వామి, పెరుమాండ్ల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లిలో సర్పంచ్ గజవెల్లి అనంతప్రసాద్తో కలిసి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి నట్టల నివారణ మందు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే, మండలంలోని కొత్తూరులో సర్పంచ్ కందికట్ల స్వామి, ఎంపీటీసీ కందికట్ల రాధమ్మ, రాజయ్య ప్రారంభించారు. కార్యక్రమాల్లో పశు వైద్యాధికారులు వీరగోని శృతి, సోమశేఖర్, గజవెల్లి రామశేఖర్, దొంతరబోయిన ఉప్పలయ్య, తౌటు గణేశ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్, దూపతండా, మోత్య తండా, రావూరు గ్రామాల్లో ఎంపీపీ లునావత్ కమల మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ నరేశ్, సర్పంచ్‌లు యశోద, జ్యోతి, గణేశ్, సంతోశ్, సిబ్బంది అమరావతి, ఐలయ్య, వెంకన్న, లక్ష్మణ్, ఉపేందర్ పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని తొగర్రాయి, తిమ్మంపేట, రేఖంపల్లి గ్రామాలో ్ల జిల్లా వెటర్నటీ వైద్యాధికారి(జేడీ) బాలకృష్ణ, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 3000 జీవాలకు మాత్రలు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. పశువైద్యాధికారులు శారదాసురేశ్, రామ్మోహన్, బాలాజీ, సర్పంచ్‌లు ఇమ్మడి యుగేంధర్, ఓడేటి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. నల్లబెల్లి మండలంలోని ఆసరవెల్లిలో పశువైద్యాధికారి సురేశ్, దామెర మండలంలోని ల్యాదెళ్లలో ఎంపీపీ కాగితాల శంకర్, పులుకూర్తిలో సర్పంచ్ గోవిందు అశోక్ గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో బొంకూరి రవియాదవ్, అమ్ముల దేవేందర్, వీఎల్వో లక్ష్మణ్, జేవీవో రవి, సిరాజొద్దీన్ పాల్గొన్నారు. గీసుగొండతో పాటు కోనాయిమాకుల, కొమ్మాల, విశ్వనాథపురంలో పశువైద్యాధికారి రమేశ్ నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. సర్పంచ్‌లు బాబు, నాగేశ్వర్రావు, రాధాబాయి, వీరాటి కవిత పాల్గొన్నారు. నెక్కొండ మండలం ముదిగొండలో పశువైద్యాధికారి మమత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎంపీపీ జాటోత్ రమేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజా ప్రభాకర్ పాల్గొన్నారు.