కాశీబుగ్గ, అక్టోబర్ 11: గ్రేటర్ వరంగల్‌లోని 3వ డివిజన్లో విలీన గ్రామాలైన ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట టీఆర్ఎస్ నూతన కమిటీలను సోమవారం రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ ఎల్లావుల లలితాయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు బుద్ధ వెంకన్న ఏకగ్రీవంగా ప్రకటించారు. పైడిపల్లి అధ్యక్షుడిగా పండుగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జన్ను రాంబాబు, జన్ను కన్నయ్య, యూత్ అధ్యక్షుడిగా చిలువేరు విజేందర్, ప్రధాన కార్యదర్శిగా బొల్ల రాకేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు చిలుక రాజు, ప్రధాన కార్యదర్శిగా జన్ను భాస్కర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బండారి కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా జన్ను అక్షయ్‌కుమార్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా అయిత ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సంపుల రవీందర్, బీసీ విభాగం అధ్యక్షుడిగా కొండ కిశోర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గంజ్జల కిరణ్, రైతు విభాగం అధ్యక్షుడిగా జన్ను దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా బండారి రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జన్ను మల్లిక, ప్రధాన కార్యదర్శిగా రవిరాకుల సుజాల ఎన్నికయ్యారు.
ఆరెపల్లి అధ్యక్షుడిగా ఈర్ల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా బట్టుమేకల రాజు, యూత్ అధ్యక్షుడిగా కొక్కరకొండ అభిలాష్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సాగర్, బీసీ విభాగం అధ్యక్షుడిగా కొయ్యడ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ఎగ్గడి ఈశ్వర్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఎండీ రహీమొద్దీన్, ప్రధాన కార్యదర్శిగా బుర్రి పెద్ద రాజు, మహిళా అధ్యక్షురాలిగా మైదం నవమాల, ప్రధాన కార్యదర్శిగా దొడ్డిపల్లి సరోజన, రైతువిభాగం అధ్యక్షుడిగా బుద్ధె రమేశ్, ప్రధాన కార్యదర్శిగా సింహగర్జన్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ తాజోద్దీన్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎండీ ఆజాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కొత్తపేట అధ్యక్షుడిగా బొచ్చు రాజు, ప్రధాన కార్యదర్శిగా నేరళ్ల భిక్షపతి, యూత్ అధ్యక్షుడిగా ఇందూరు రంజిత్, ప్రధాన కార్యదర్శిగా దుంపేడు విజయ్, బీసీ విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా ఇందూరి మచ్చేందర్, రాయరాకుల రవి, ఎస్సీసెల్ అధ్యక్ష కార్యదర్శులుగా ఇసంపెల్లి రమేశ్, ఐలయ్య, రైతు విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా శాబతు భద్రయ్య, ఊరుగొండ రాజేందర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా గుర్రం కోమల, ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి పుష్ప, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ రహీంపాషా, కార్యదర్శిగా ఎండీ ఖాజాపాషా ఎన్నికయ్యారు.