గీసుగొండ, ఆగస్టు 9 : జీవాలకు నట్టల మందు తాగించాలని సర్పంచ్ జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మం డలంలోని ఎలుకుర్తి గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి రమ్య, జేవీవో సతీశ్, రజిత, చిరంజీవి, గోపాల మిత్రలు పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండల కేంద్రంతో పాటు ఇస్లావత్ తం డా, దౌలత్‌నగర్, సీకే తండాల్లో పశువైద్యాధికారి డాక్టర్ నరేష్, సర్పంచ్‌లు చింతపట్ల మాలతి, రమేశ్, వెంకన్న చేతుల మీదుగా నట్టల నివారణ మందు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి
చెన్నారావుపేట : గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ మందు పంపిణీకి ఏర్పాటు చేసిన శిబిరాలను రైతులు వినియోగించుకోవాలని సర్పంచ్ కుండె మల్లయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అల్లి భిక్షపతికి చెంది న గొర్రెలకు, లింగాపురంలో సర్పంచ్ తప్పెట రమేశ్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు తాగించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి మంజీలాల్, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, ఉప సర్పంచ్ కంకల మాధవి, శ్రీనివాస్, కోరె మల్లయ్య, బొంత కుమారస్వామి, మంగ రాజు పాల్గొన్నారు.
నెక్కొండలో ..
నెక్కొండ : మండల కేంద్రంలో మేకలు, గొర్రెలకు పశువైద్యాధికారి మమత నట్టల మందు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, వార్డు సభ్యులు గాదె రాకేశ్, సొసైటీ అధ్యక్షులు రాపాక లచ్చులు, రాపాక విజేందర్, తోకల రాజు, సమ్యయ్య పాల్గొన్నారు.