ఎల్కతుర్తి, డిసెంబర్ 16 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో ఘ నంగా నిర్వహించగా, దాని చుట్టుపక్కల గ్రా మాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం విశే షం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రానికి, చింతలపల్లి, ఇందిరానగర్ గ్రామాలకు శివారు ప్రాంతంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. దీనికి ఈ గ్రా మాల ప్రజలు పార్టీలకతీతంగా ముందుకొచ్చి కేసీఆర్ మా ఊరికి వస్తున్నారనే సంతోషంతో వ్యవసాయ భూములిచ్చారు. సభ అనంతరం నిర్వాహకులు రైతులందరికీ తమ భూములకు సంబంధించిన గెట్లు(పరిధి) యథావిధిగా సర్వేయర్లతో కొలిపించి అప్పగించారు.
అదేవిధంగా పంటలు నష్టపోయిన వారికి నష్ట పరిహారాన్ని సైతం ఇచ్చారు. దీనికి రైతులందరు హర్షం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన గ్రామాల పరిధిలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం విశేషం. ఎల్కతుర్తి మండల కేంద్రం ఎస్సీ మహిళకు కేటాయించగా, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా అంబాల స్వప్న, బీఆర్ఎస్ నుంచి మునిగడప లావణ్య పోటీ పడ్డారు. ఇందులో స్వప్నకు 935 ఓట్లు, లావణ్యకు 1890 ఓట్లు వచ్చాయి. మండలంలోనే అత్యధికంగా 955 ఓట్లతో బీఆర్ఎస్ బలపర్చిన లావణ్య గెలుపొందారు. అలాగే ఇందిరానగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థితో పాటు రెబల్ అభ్యర్థి కూడా పోటీ పడ్డారు. ఇందులో బీఆర్ఎస్ అభ్య ర్థికి 134 ఓట్లు, రెబల్ అభ్యర్థికి 90 ఓట్లు వచ్చా యి.
కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 52 ఓట్లు మా త్రమే వచ్చాయి. చింతలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన బొంకూరి రజితకు 429 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బొంకూరి క్రాంతికుమార్‌కు 384 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా మండలంలోనే అతిపెద్ద గ్రామమైన దామెరలో బీఆర్ఎస్ అభ్యర్థి మంకెన పద్మకు 1852 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థినికి 1624 ఓట్లు వచ్చాయి. ఈ గ్రామం అనాదిగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ గ్రా మంలో సైతం 228 ఓట్లతో బీఆర్ఎస్ విజ యం సాధించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించిన ఎల్కతుర్తి, దామెర, చింతలపల్లి, ఇందిరానగర్ శివారు గ్రామాల్లో పార్టీ తన ఉనికిని చాటుకొని స ర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం విశే షం. మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉండగా, 2 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 8 గ్రామాల్లో బీఆర్ఎస్, 10 గ్రా మాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో సీపీఐ, 1 స్థా నంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అధికార పార్టీకి దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గెలుపొందడంపై గు లాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.