వరంగల్ రూరల్, ఆగస్టు 16 (నమస్తేతెలంగాణ) : మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వాటర్ ట్యాంకు ల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నా యి. సాధ్యమైనంత త్వరలో ట్యాంకులు, పైపులైన్ ని ర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన నీరందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దాదాపు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పనులు పూర్తయి నీటి సరఫరా జరుగుతున్నది. అయితే, తొలుత టెండర్లు దక్కించుకు న్న కాంట్రాక్టర్లు కొన్ని మున్సిపాలిటీల పరిధిలో పను లు ప్రారంభించలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సాంకేతిక సమస్యలను అధిగమించి తిరిగి ఆ యా మున్సిపాలిటీల పరిధిలో రీటెండర్లు నిర్వహించిం ది. వీటిని పొందిన కాంట్రాక్టర్లు 18 నెలల కాలపరిమితితో పనులు పూర్తి చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం చే సుకున్నారు. మున్సిపాలిటీల పరిధిలో గతేడాది పను లు మొదలు పెట్టగా, జెట్ స్పీడ్‌తో జరుగుతున్నాయి.
రూ.140 కోట్లతో పనులు..
రీటెండర్లు నిర్వహించిన మున్సిపాలిటీల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ మున్సిపాలిటీలు ఉన్నాయి. సుమారు రూ.140 కోట్లతో ఈ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం పనులు చేపట్టింది. నర్సంపేటలో రూ.37.67, పరకాలలో రూ.31.41, భూపాలపల్లిలో రూ.54.09, జనగామలో రూ.16.27 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాటర్ ట్యాంకులు, ఫీడర్మెన్, పంపిణీ పైపులైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్యాంకుల్లో నీరు నింపేందుకు 400 ఎంఎం డయా, ట్యాంకుల నుంచి నల్లా ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా కోసం 100 ఎంఎం నుంచి 300 ఎంఎం డయా పైపులైన్ నిర్మిస్తున్నారు. జనగామ, భూపాలపల్లి పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో పనుల పూర్తయి, నీటిని కూడా సరఫరా చేస్తున్నారు.
పనుల పురోగతి ఇది..
నర్సంపేట పట్టణంలో నాలుగు వాటర్ ట్యాంకులు నిర్మించేందుకు నిర్ణయించారు. సర్వాపూర్ వద్ద ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో చేపట్టిన వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తయింది. ఫైర్ స్టేషన్, మున్సిపల్ ఆఫీసు, మల్లంపల్లి రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఆవరణలో ఒక్కో వాటర్ ట్యాంకు నిర్మించాల్సి ఉంది. 100, 150, 200, 300, 400 ఎంఎం డయా ఫీడర్మెన్, పంపిణీ పైపులైన్ దాదాపు 80 కి.మీ. నిర్మించాల్సి ఉం డగా, 6 కి.మీ. పూర్తయినట్లు ఇంజినీర్లు వెల్లడించారు.
పరకాలలో నాలుగు..
పరకాల పట్టణంలోనూ నాలుగు ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా ఇక్కడ మాదారం హరిజనవాడ వద్ద చేపట్టిన 6 లక్షల లీటర్ల కెపాసిటీతో కూడిన ట్యాంకు పనులు చివరి దశకు చేరాయి. వెల్లంపల్లిరోడ్డులోని పశువుల అంగడి వద్ద 7 లక్షల లీటర్లు, సీఎంఎస్ గోడౌన్ వద్ద 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల ని ర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎస్ఐ స్కూల్ వద్ద మరో ట్యాంకు నిర్మించాల్సి ఉంది. ఈ పట్టణంలో 80 కిమీ ఫీడర్మెన్, పంపిణీ పైపులైన్ నిర్మించాల్సి ఉంది. ఇందులో సుమారు 18 కిమీ పైపులైన్ నిర్మాణం పూర్తయింది. దసరా పండుగ వరకు రెండు, సంక్రాంతి పం డుగ వరకు రెండు ట్యాంకుల ద్వారా ఇక్కడ జోన్ల వారీ గా నీరివ్వాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.
భూపాలపల్లిలో ఆరు ట్యాంకులు..
శరవేగంగా విస్తరిస్తున్న భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు వాటర్ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. కాలర్మార్క్స్కాలనీ, పుల్లూరురామయ్యపల్లె, సుభాష్‌కాలనీ వద్ద ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. సుభాష్‌కాలనీ వద్ద ఐదు లక్షల సామర్థ్యంతో కూడిన ట్యాం కు నుంచి ప్రజలకు నీటి సరఫరా కూడా మొదలైంది. కాలర్మార్క్స్ కాలనీ ట్యాంకు నుంచి మరో 15రోజు ల్లో నీటి సరఫరా ప్రారంభం కానుంది. జంగేడు, కాశీంపల్లి, లక్ష్మీనగర్ వద్ద ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. 120 కి.మీ. ఫీడర్మెన్, పంపిణీ పైపులైన్‌కు గాను దా దాపు 80 కి.మీ. నిర్మించినట్లు అధికారులు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన మిషన్ భగీరథ పను ల్లో 65శాతం పూర్తయ్యాయని, మరో నాలుగు నెలల్లోగా మిగతా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
జనగామ ముందంజ..
భగీరథ పనుల్లో జనగామ మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నాలుగు వాటర్ ట్యాంకులకు గాను ధర్మకంచ జడ్పీ స్కూల్ వద్ద 10లక్షల కెపాసిటీతో ట్యాంకు నిర్మాణం పూర్తయింది. సాయినగర్ వద్ద 10 లక్షలు, ఆబాది వద్ద 6 లక్షలు, చీటకోడూరు ఫిల్టర్‌బెడ్ వద్ద 10లక్షల సామర్థ్యంతో చేపట్టిన మూడు ట్యాంకుల ని ర్మాణ పనులు 80శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. 30 కి.మీ. ఫీడర్మెన్, పైపులైన్ నిర్మించాల్సి ఉండగా వందశాతం పూర్తయినట్లు తెలిపారు.