గ్రంథాలయ డైరెక్టర్లు గంపరాజేశ్వర్గౌడ్, పుట్టపాక కుమారస్వామి కొనియాడారు. నర్సంపేటలో జరిగిన సార్ జయంతిలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారన్నారు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డీఎం శ్రీనివాసరావు, వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఆర్డీవో, తాసిల్ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కళాశాలల్లో సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నల్లబెల్లి: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్ ఎన్ రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరాజ్, హెచ్ఎం రామస్వామి, టీచర్ కొలిపాక సంగీత, ఉద్యమకారులు గందె శ్రీనివాస్‌గుప్తా, భట్టు సాంబయ్య, నన్నెసాహెబ్, చక్రపాణి, నాగెల్లి శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, వీరస్వామి, నరహరి, పరికి కోర్నేల్ పాల్గొన్నారు.
పరకాల: పట్టణంలోని శాఖ గ్రంథాలయం, మున్సిపాలిటీ, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వార్డుల్లో జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాదేవి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు దగ్గు విజేందర్‌రావు, పావుశెట్టి వెంకటేశ్వర్లు, పసుల రమేశ్, ఏకు రాజు, నల్లెల్ల అనిల్, బొచ్చు వెంకటేశ్ పాల్గొన్నారు.
దుగ్గొండి: మండలకేంద్రంలోని వివిధ పార్టీల కార్యాలయాల్లో ఆయా పార్టీల మండలాధ్యక్షులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో హెచ్ఎంలు, కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు సార్ చిత్రపటాలకు నివాళులర్పించారు. జడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, రంగారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, ఏపీఎం రాజ్‌కుమార్, ఎంజేపీటీ, కేజీబీవీ గురుకులాల ప్రిన్సిపాళ్లు ఎన్ దేవేందర్, మంజుల, ఏవో దయాకర్, ఎంఈవో సత్యనారాయన్, మందపల్లి, నాచినపల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, రాంరెడ్డి, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట: మండల పరిషత్‌లో ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపీటీసీలు మేకల శ్రీనివాస్, వావిలాల వేణుగోపాల్, విష్ణువర్ధన్, ఈజీఎస్ ఏపీవో అనిత, సూపరింటెండెంట్ అనురాధ, టైపిస్టు శరత్‌కుమార్ పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ఉప్పునూతల ప్రసాద్, రవీంద్రాచారి, ఓంకార్, వీరనర్సయ్య, రామగిరి రమేశ్, వెంకటేశ్, సురేంద్రాచారి పాల్గొన్నారు. బీఎస్ఎస్ అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్ సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఊరూరా జయంతి వేడుకలు..
ఆత్మకూరు: జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని సార్ విగ్రహానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు రంపీస మనోహర్, రబీయాబీ హుస్సేన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, ఎంపీటీసీ బయ్య రమారాజు, టీఆర్ఎస్ నాయకులు బాషబోయిన పైడి, కొమ్ము కుమారస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటలో ఆయన విగ్రహానికి సర్పంచ్ ఎనకతళ్ల విజయాహంసాల్రెడ్డి, ఎంపీటీసీలు కమలాపురం రమేశ్, బీరం రజినీకర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముద్దం సాంబయ్య పూలమాలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నర్మద, ఎంపీవో ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు బొల్లోజు కుమారస్వామి, మార్క రజినీకర్, జయశంకర్ సేవా సమితి సభ్యులు కొత్తపల్లి జయశంకర్, ఓదెల సత్యనారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే, అక్కంపేటలో జయశంకర్ విగ్రహానికి పరకాల ఏసీపీ జే శివరామయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐ రంజిత్‌కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ రవీందర్ పాల్గొన్నారు.
వర్ధన్నపేట: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా పాల్గొన్నారు. మండలంలోని ఇల్లంద, కట్య్రాల, బండౌతాపురం, చెన్నారం, ఉప్పరపల్లిలోనూ సార్ జయంతిని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, వర్ధన్నపేట కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కందగట్ల కళావతి ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి నిర్వహించారు.
రాయపర్తి: మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంతోపాటు అన్ని గ్రామాల్లోని జీపీల్లో సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, సర్పంచ్‌లు, మండల నాయకులు గారె నర్సయ్య, పూస మధు, కాంచనపల్లి వనజారాణి, ఎండీ నయీం, బాషబోయిన సుధాకర్, సాగర్‌రెడ్డి, ఆశ్రఫ్ పాషా, సత్తూరి నాగరాజు పాల్గొన్నారు.
పర్వతగిరి: ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సార్ చిత్రపటానికి ఎంపీపీ లునావత్ కమలపంతులు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్ నివాళులర్పించారు. సర్పంచ్ చింతపట్ల మాలతి, ఇస్లావత్ తండా సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బొట్ల మహేంద్ర, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, కార్యదర్శులు పాల్గొన్నారు.
దామెర: ఎంపీడీవో కార్యాలయం, వెంకటాపురంలో ఎంపీపీ కాగితాల శంకర్ సార్ చిత్రపటాలకు నివాళులర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. కోగిల్వాయి, ల్యాదెళ్ల, పులుకుర్తి, ఊరుగొండలో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, కే శ్రావణ్య-అనిల్, గోవిందు అశోక్, గోగుల సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ జాకీర్, సర్పంచ్‌లు పున్నం రజితాసంపత్, వడ్డేపల్లి శ్రీనివాస్, తాసిల్దార్ రియాజొద్దీన్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీవో యాదగిరి, ఏపీవో శారద, బండి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ: ఊకల్, గంగదేవిపల్లిలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు పాల్గొని జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లలోని గొర్రెకుంట క్రాస్ వద్ద సార్ చిత్రటానికి కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషాశివకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌లు మల్లారెడ్డి, జైపాల్‌రెడ్డి, నాగదేవత, బాలిరెడ్డి, బాబు, స్రవంతి, అనిల్, రాధాబాయి, నాగేశ్వర్రావు, సరోజన, నాయకులు రఘు, సునీల్, రాజయ్య, రమేశ్, ప్రభాకర్, లింగామూర్తి, జనార్దన్, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సయ్య, కరుణాకర్, కిశోర్, బాబు, వేణు, బాలయ్య పాల్గొన్నారు.
నెక్కొండ: స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాముతోపాటు టీఆర్ఎస్ నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్‌రావు, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, కట్కూరి నరేందర్‌రెడ్డి, ఈదునూరి వెంకటేశ్వర్లు, గాదె భద్రయ్య, రావుల భాస్కర్‌రెడ్డి, కారింగుల సురేశ్, పొడిశెట్టి సత్యం, తోకల రాజు, గాదె రాకేశ్, ఉప సర్పంచ్ డీ వీరభద్రయ్య, ఎంపీటీసీ లింగాల అజయ్, పెద్దకోర్పోలు సర్పంచ్ మహబూబ్‌పాషా, దీక్షకుంట సర్పంచ్ ఆలకుంట సురేందర్ పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రమేశ్, ఎంపీడీవో సాహితీమిత్ర, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ డీఎస్ వెంకన్న, వీఆర్వోలు, అప్పల్రావుపేట జడ్పీఎస్‌ఎస్‌లో టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, హెచ్ఎం బీ శ్రవణ్‌కుమార్, జిల్లా కార్యదర్శి యాకయ్య, పీఎస్‌హెచ్ సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలంకానిపేట జీపీలో సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, వార్డు సభ్యులు తదితరులు సార్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
చెన్నారావుపేట: ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ బదావత్ విజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ పాల్గొని సార్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వివిధ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్ మండల యువనాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎంఏ గఫార్, ఉపసర్పంచ్ కంకల మాధవి, చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీల చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, వైస్ చైర్మన్ చింతకింది వంశీ, వార్డు సభ్యులు శ్రీధర్‌రెడ్డి, సతీశ్, సొసైటీ డైరెక్టర్లు రాజు, రాంబాబు, మల్లయ్య, కొమురయ్య, రాములు, రమేశ్, సాయికుమార్, విక్రమ్, నరేశ్, కృష్ణ, రవినాయక్, శేఖర్, భద్రు పాల్గొన్నారు.
ఖానాపురం: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, తాసిల్లో తాసిల్దార్ జూలూరి సుభాషిణి, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రాళ్లబండి ప్రసాద్, జీపీల్లో సర్పంచ్‌లు జయశంకర్ జయంతి నిర్వహించారు. ఎంపీడీవో సుమనావాణి, ఆర్ఐ ఉపేందర్, వీఆర్వోలు శ్రావణ్, వెంకన్న, లక్ష్మీనర్సు, మల్లయ్య, ఉపసర్పంచ్ మేడిద కుమార్, మచ్చిక అశోక్, బొప్పిడి పూర్ణచందర్, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
నడికూడ: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మచ్చ అనసూర్య ఆధ్వర్యంలో సార్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోడెపాక సుమలత, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, ఎంపీవో అఫ్జల్, నర్సక్కపల్లి సర్పంచ్ తిప్పర్తి సాంబశివారెడ్డి, కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.