నల్లబెల్లి, ఆగస్టు 8 : పల్లెప్రగతితో నల్లబెల్లి మండల కేంద్రం అభివృద్ధి చెందింది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో అన్ని హంగులతో అభివృద్ధి జరిగింది. డంపింగ్‌యార్డు ఉపయోగంలోకి వచ్చి జీపీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. శ్మశానవాటికను సైతం అన్ని సౌకర్యాలతో నిర్మించారు. ప్రజలకు పల్లెప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతోంది. గత ప్రభుత్వాల హయాంలో నల్లబెల్లి మండలకేంద్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో నల్లబెల్లి అన్ని హంగులతో అభివృద్ధి చెందింది. అలాగే, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం కావడంతో అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా రూ.12.60లక్షలతో శ్మశానవాటిక, రూ.2.60లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మించారు. అలాగే, 2200 మొక్కలు నాటి పల్లెప్రకృతి వనం రూపొందించారు. నిధులు కేటాయిస్తూ మండల కేంద్రం అభివృద్ధి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారు.
ప్రజల సహకారంతోనే..
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి, గ్రామ ప్రజల సహకారం, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామం అభివృద్ధి చెందింది. జిల్లా అధికారుల ఆదేశాలను పక్కాగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా గ్రామ పురోభివృద్ధికి కృషి చేశాం.
ఎమ్మెల్యే ఆదేశాలకనుగుణంగా..
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ పల్లెప్రగతి పనులు చేపట్టాం. డంపింగ్‌యార్డు ద్వారా గ్రామపంచాయతీకి అదనపు ఆదాయం వస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడం వల్లే అభివృద్ధి సాధ్యమైంది.