గీసుగొండ, ఏప్రిల్ 19 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను మంగ ళవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మారెడ్డి మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ తయా రుచేసి ప్రజలకు వైద్యం అందించనుందన్నారు. దీని ఆధారంగానే రాను న్న రోజుల్లో పరీక్షలు చే స్తారని ఆయన తెలిపారు. మరో రెండురోజులపాటు గీసుగొండలోనే క్యాంపు నిర్వహించాలని కోరారు.
కలెక్టర్ గోపి మాట్లాడుతూ ఆరో గ్యం పట్ల ఎలాంటి అనుమానమున్నా వెంటనే పరీక్షలు చేసుకోవాలని అన్నారు. శిబిరంలో 746 మందికి పరీక్షలు చేసి మందులను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స శ్రీకో ట, డీఎంహెచ్‌వో వెంకటరమణ, అదనపు వైద్యాధికారి మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో గోపాల్ రావు, ఎంపీపీ సౌజన్య, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ దౌడు బాబు, వైద్యాధికారి మాధవీలత, శ్రీనివాస్, తహసీల్దార్ సుహాసిని, ఎంపీడీవో రమేశ్, ఆయుష్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం రామారావు, వైద్యులు పద్మావతి, అమృత వల్లి, జయప్రకాశ్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.