ఖిలావరంగల్, సెప్టెంబర్ 24: ప్రపంచ పర్యా టక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో హెరిటేజ్ వాక్ ను ఏర్పాటు చేయగా, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ జెండా ఊపి ప్రారంభించారు. కాకతీయుల కట్టడాలు చారిత్రక నేపథ్యాన్ని తెలు పుతూ నిర్వహించిన హెరిటేజ్ వాక్ స్థానికులకు ఆకట్టుకుంది. కోట క్రీడామైదానం నుంచి మధ్య కోటలోని ఖుష్‌మహల్ వరకు నిర్వహించి వాక్ లో వారసత్వ కట్టడాలను పరిరక్షించుకుందామని నినదించారు. అలాగే స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భా గంగా రాతికోట ఉత్తర ద్వారం వద్ద కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యం లో చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ. వారస త్వ కట్టడాలను పరిరక్షించుకునే బాధ్యత అధికా రులదే కాకుండా ప్రతి ఒక్కరిదీ అన్నారు. విశ్వ వ్యాప్తమైన ఈ ప్రాంత చారిత్రక విశిష్టతనే వీక్షిం చేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల పట్ల మర్యాదగా నడుచుకోవాలన్నా రు. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంటేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయ న్నారు. ఖిలావరంగల్‌కు త్వరలోనే శిల్పారామం వస్తుందన్నారు. అలాగే మ్యూజియం భవనం కూడా పూర్తి అవుతుందన్నారు. హెరిటేజ్ వాక్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జిల్లా పర్యాట క శాఖ అధికారి శివాజీ కృతజ్ఞతలు తెలిపారు.
రా మప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినందున ఈ నెల 25న ఆలయంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హరిత కాకతీ యలో పర్యాటక రంగంపై సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ నెల 26న రామప్ప, ఘనపురం కోటగుళ్లు, రెడ్డిగూడెం గుడిని కలుపుకొని హెరిటేజ్ టూర్ ఏ ర్పాటు చేశామన్నారు. యాత్రలో భోజనం, స్నా క్స్‌తో కలుపుకొని పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.250 టికెట్ ధర ఉంటుందని, హనుమ కొండ కలెక్టరేట్లోని పర్యాటక శాఖ కార్యాల యంలో చెల్లించి టికెట్‌ను బుక్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 98493388 54, 9866919131 నంబర్లలో సంప్రదించాల న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ మల్లూనాయక్, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణ, బైరబోయిన ఉమాదామోదర్, ఖిలా వరంగల్ తహసీల్దార్ మంజుల, ఎన్ఎస్ఎస్ కోఆ ర్డినేటర్ శ్రీనివాస్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, వంశీ, లోకేశ్, కొమురయ్య, గైడ్ దేనబోయిన రవియాద వ్, మండల పరశురాములు, కేంద్ర పురావస్తు శాఖ కోట ఇన్చార్జులు విజయ్, కుమారస్వామి, టీఎస్‌టీడీసీ కోట మేనేజర్ అజయ్, సేవా టూరి జం కల్చరల్ సొసైటీ కోఆర్డినేటర్ వింజమూరి జగదీశ్, కొప్పుల ప్రశాంత్, దయ్యాల శ్రీకాంత్, కొత్తపెల్లి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.