కమలాపూర్, ఆగస్టు 9 : మండలంలోని ఉప్పలపల్లి యాదవులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు సీఎం కేసీఆరే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం అని కొనియాడారు. రైతులకు 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, గొల్లకుర్మలకు గొర్ల పంపిణీ, కేసీఆర్ కిట్టు, దళిత బంధు పథకాలు ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో యాదవ సంఘం మండలాధ్యక్షుడు పోతరబోయిన రాజయ్య, తనుగుల అయిలయ్య, నరంగుల రాజు, బసవేయిన శ్రీనివాస్, చేపూరి బాలరాజ్, పాక లక్ష్మి, చేపూరి రాజేశ్వరి, గుండెబోయిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.