నర్సంపేట, ఆగస్టు 1 : కార్మికుల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో తాడు, టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ వేడుకల ను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. డ్రైవర్ల కు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో ఎన్ఆర్ఐ సెల్ నాయకుడు శానబోయిన రాజ్‌కుమార్‌తో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆటో డ్రైవర్లకు శాశ్వతంగా రోడ్ ట్యాక్స్ మాఫీ చేసిందన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షల బీమా అందజేస్తోందన్నారు. అలాగే, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో రూ.3కోట్లతో సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయనునట్లు చెప్పారు.
ఎన్ఆర్ఐ సెల్ నాయకుడు శానబోయిన రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు తాడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, తాడు డివిజన్ అధ్యక్షుడు కల్లెపల్లి సురేశ్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, తాడు పట్టణ అధ్యక్షుడు కుమార్, పట్టణ ఇన్చార్జ్ కొమ్మ వినయ్, మండల శ్రీనివాస్, పంజాల రాజు, రాజబాబు, అంజిపెల్లి రాజు పాల్గొన్నారు. కాగా, స్నేహితుల దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి మొక్కను అందజేశారు. నర్సంపేట కస్తూర్బా మహిళా మండలి ఆధ్వర్యంలో కూడా వేడుకలు జరిగాయి.
పెంచిన వేతనాలు అమలు చేయాలి
మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్కేవీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సమస్యలను మున్సిపల్ సీడీఎంఏ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిశెట్టి పద్మాప్రసాద్, పాలడుగుల రమేశ్, మాదాసి నర్సింహారావు, గడ్డం సమ్మయ్య, మాదాసి సారయ్య, భాస్కర్, అల్వాల రాజు, రాంబాబు, శ్రీకాంత్, ప్రతాప్, దేవేందర్, శ్రీను, ప్రశాంత్ పాల్గొన్నారు.