నర్సంపేట, ఆగస్టు 16: హుజూరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సీఎం దళితబంధు ప్రారం భ సభకు జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లాయి. నర్సంపేట పట్టణం, మండలం నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో పార్టీ కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున వెళ్లారు. ముఖ్యమంత్రిని కల్లారా చూడాలని, ప్రసంగాన్ని వినేందుకు ఉత్సా హం చూపుతూ ప్రతి నియోజకవర్గం నుంచి తరలివెళ్లారు.
పర్వతగిరి : హుజూరాబాద్‌లో దళితబంధు సభకు తరలివెళ్లే పార్టీ నాయకులు, దళితుల వాహనాలను మండల కేంద్రంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. సీఎం సభకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం హర్షణీయమని అన్నారు. తరలి వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, పార్టీ నాయకులు మాలతి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు చింతపట్ల సోమేశ్వర్రావు, మాడ్గుల రాజు, రమేశ్, విజయ ఉన్నారు.
నల్లబెల్లి: మండలం నుంచి పార్టీ నాయకులు, దళితులు సీఎం సభకు తరలి వెళ్లారు. ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ ఆధ్వర్యంలో సభ విజయవంతం చేసేలా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను తరలించేందుకు కృషి చేశారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట: మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లే బస్సులను మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, యువనేత కంది కృష్ణచైతన్యరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సభకు వెళ్లిన వారిలో మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, నాయకులు కందకట్ల సాంబయ్య, మొగిలి కేశవరెడ్డి, ఆంగోత్ వీరాసింగ్, కుసుమ నరేందర్, మంద జనార్దన్, బానోత్ గణేశ్, పిండి భిక్షపతి, వార్డు సభ్యులు జున్నూతుల శ్రీధర్‌రెడ్డి, రాసమల్ల సతీశ్, నమిండ్ల సురేశ్, కందిక పృథ్వీరాజ్, రాజులపాటి ఐలయ్య, ఓరుగంటి రమేశ్, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు మూడు రమేశ్‌నాయక్, గుగులోత్ రాజు ఉన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: సీఎం సభకు మండలం నుంచి రెండు బస్సుల్లో 100 మందికి పైగా టీఆర్ఎస్ నాయకులు, దళితులు, అభిమానులు తరలివెళ్లారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు పార్టీ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా ప్రయోజకులను చేసేందుకు ప్రతి ఇంటికీ రూ.10లక్షలు అందించే పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు మండల దళితుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌లు ఐలయ్య, లావుడ్యా రమేశ్‌నాయక్, వల్లెపు సోమయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దుగ్గొండి నుంచి..
దుగ్గొండి: మండలంలోని వివిధ గ్రామాల నుంచి దళితులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు టీఆర్ఎస్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. దళితుల సంక్షేమానికి దళిత బంధు తోడ్పాటు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కాట్ల కోమల, మేరుగు రాంబాబు, లింగంపల్లి ఉమ, ముదురుకోళ్ల కృష్ణ, బొమ్మగాని వెంకటేశ్వర్లు, ముత్యాల స్వామి, నల్లబెల్లి శోభన్, తిరుపతియాదవ్, రాజేందర్, రాజు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు నుంచి హుజూరాబాద్‌కు..
ఆత్మకూరు: మండలంలోని వివిధ గ్రామాల నుంచి దళితులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం సభకు తరలి వెళ్లారు. మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి పార్టీ జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాల నుంచి 1500 మందిని తరలించినట్లు పేర్కొన్నారు. వెళ్లినవారిలో ఎంపీటీసీలు బయ్య రమారాజు, మాజీ ఎంపీటీసీ నత్తి సుధాకర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు బాషబోయిన పైడి, ప్రధాన కార్యదర్శి కొమ్ము కుమారస్వామి, పాపని రవీందర్, ఎండీ అంకుస్, టీఆర్ఎస్ నాయకులు, దళిత కులస్తులు నత్తి సాంబయ్య, బోళ్ల శ్రీనివాస్, నత్తి కర్ణాకర్, కోగిల సాంబయ్య, నత్తి రవి, తన్గుల రాజు ఉన్నారు.
దామెరలో..
దామెర: మండలంలోని గ్రామాల నుంచి దళితులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. పులుకుర్తి, దామెర, కోగిల్వాయి, ఊరుగొండ గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ‘కేసీఆర్ జిందాబాద్, దళితులను ఆదుకునేది ముఖ్యమంత్రి’ అంటూ నినాదాలు చేశారు. ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, సర్పంచ్‌లు గోవిందు అశోక్, శ్రీనివాస్, శ్రావణ్య, ఎంపీటీసీలు కృపాకర్‌రెడ్డి, రాము, టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు కమలాకర్, సిలివేరు నర్సయ్య, కుక్క అనిల్, ముదిగొండ కృష్ణమూర్తి, శరత్, జన్ను సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి: మండలంలోని 39 గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుల నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల్లో హుజూరాబాద్‌కు వెళ్లారు. మండలంలోని బస్టాండ్ సెంటర్లో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు జెండాలు ఊపి ప్రారంభించారు. పార్టీ మండల నాయకులు గారె నర్సయ్య, పూస మధు, అయిత రాంచందర్, గబ్బెట బాబు, ఎండీ నయీం, మచ్చ లక్ష్మీనారాయణ, బానోత్ లక్ష్మణ్‌నాయక్ ఉన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: సీఎం సభకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, ప్రముఖులు బస్సులను ప్రారంభించారు. సుమారు 2వేల మంది వరకు నాయకులు, దళిత యువకులు బయల్దేరి వెళ్లారు.
పరకాల నుంచి సీఎం సభకు..
పరకాల: పట్టణం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, దళితులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రేగూరి విజయ్‌పాల్‌రెడ్డి, పార్టీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి మడికొండ శ్రీను, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నడికూడలో..
నడికూడ: మండలంలోని నర్సక్కపల్లి, వరికోల్, నడికూడ, కౌకొండ గ్రామాల నుంచి సీఎం సభకు తరలి వెళ్లారు. నర్సక్కపల్లికి చెందిన ఎస్సీ సెల్ కార్యదర్శి కోడెపాక భాస్కర్, మాజీ ఎంపీటీసీ కొండపాక సమ్మయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు జన్ను స్వామి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజేందర్, రవీందర్, నిరంజన్, సిద్ధు, రాహుల్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ: మండలంతో పాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులు, దళితులు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎలుకుర్తిలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు మాట్లాడుతూ దళితబంధు పథకం ప్రారంభ సభకు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు జైపాల్‌రెడ్డి, నాగేశ్వర్రావు, ప్రకాశ్, మల్లారెడ్డి, నాగదేవత, ఎంపీటీసీలు రజిత, వీరారావు, వివిధ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళితులు పాల్గొన్నారు.