పరకాల, సెప్టెంబర్ 7: టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక ఉత్సాహంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని వెంకటాపూర్, హైబోత్ పల్లి గ్రామాల్లో కమిటీలను ఎన్నుకున్నారు, వెంకటాపూర్ గ్రామ అధ్యక్షుడిగా బొంపెల్లి విజేందర్, ప్రధాన కార్యదర్శిగా సిలివేరు సదానందం, హైబోత్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కంకల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ అక్బర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యుడు గురిజపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ సిలివేరు మొగిలి, హైబోత్పల్లి సర్పంచ్ కంచ కుమారస్వామి, నాయకులు మునిగాల సురేందర్ రావు, శ్రీరాములు పైడీ, పోతరాజు అశోక్, పల్లెబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.
అగ్రంపహాడ్, చౌళ్లపల్లి గ్రామ కమిటీలు
ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్, చౌళ్లపల్లి గ్రామాల టీఆర్ఎస్ కమిటీలను మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి ప్రకటించారు. అగ్రంపహాడ్ గ్రామ అధ్యక్షుడిగా శీలం సాంబయ్య, ఉపాధ్యక్షులుగా బొమ్మగాని సత్యం, ఆవుల రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా మాదాసి రాజన్న, కార్యదర్శిగా కత్తెరశాల రాజు, ప్రచార కార్యదర్శిగా కత్తెరశాల కార్తీక్, సహాయ కార్యదర్శిగా మాదాసి ప్రభాకర్, కోశాధికారిగా గుమ్మడి మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా మద్దూరి సాంబయ్య, మాదాసి శ్రీను, మెంతల నర్సింహారెడ్డి, కత్తెరశాల సాంబయ్య, వంచ మల్లారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే, చౌళ్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా మోరె మహేందర్, ప్రధాన కార్యదర్శిగా కొక్కరకొండ బద్రి, ఉపాధ్యక్షులుగా రాచర్ల రవి, మోరె కృష్ణ, కార్యదర్శిగా సోలెంక రాజు, ప్రచార కార్యదర్శిగా కౌడగాని శ్రీకాంత్, కోశాధికారిగా ఆదరసాని మోహన్‌రావు, సభ్యులుగా ఎరుకొండ తిరుపతి, బొమ్మగాని వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కమలాపురం రవీందర్రావు, మోరె కుమారస్వామి, బుట్టి సారయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంజీవరెడ్డి తెలిపారు. అలాగే, చౌళ్లపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడిగా పూజూరి తిరుమలేశ్, ప్రధాన కార్యదర్శిగా సోలంక నాగరాజు, ఉపాధ్యక్షుడిగా మరిగిద్దె రంజిత్, ప్రచార కార్యదర్శిగా గుర్రం చరణ్ ఎన్నికైనట్లు మండల యూత్ అధ్యక్షుడు వేముల నవీన్ ప్రకటించారు. కార్యక్రమంలో గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబాటి రాజస్వామి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బోళ్లబోయిన రవియాదవ్, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధికరాజు, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్యరవి, ఉపసర్పంచ్ పూజారి స్వప్న రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
4వ డివిజన్ మైనార్టీ కమిటీ..
హనుమకొండ చౌరస్తా : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్ అన్నారు. మంగళవారం పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆదేశాల మేరకు డివిజన్ టీఆర్ఎస్ మైనార్టీ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా మహమ్మద్ యాకూబ్, గౌరవ సలహాదారుగా మహమ్మద్ ఇస్మాయిల్, అధ్యక్షుడిగా ఖుర్బాన్, సంయుక్త కార్యదర్శిగా యాకూబ్(సోషల్ మీడియా వారియర్), కోశాధికారిగా యాకూబ్ ఎన్నికయ్యారు.
టీఆర్ఎస్ పెంచికల్‌పేట గ్రామఅధ్యక్షుడిగా మోహన్‌రెడ్డి
ఎల్కతుర్తి : మండలంలోని పెంచికల్‌పేట గ్రామంలో టీఆర్ఎస్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా యాళ్ల మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నద్దునూరి రాములు, ప్రధాన కార్యదర్శిగా చిలుముల రామకృష్ణ, కోశాధికారిగా ముప్పు కుమారస్వామి, ప్రచార కార్యదర్శిగా సురుకంటి తిరుపతిరెడ్డి, సభ్యులుగా బర్మ భిక్షపతి, రాంపెల్లి వెంకటేశ్వర్లు, రామిడి శ్రీనివాస్, గొర్రె రాజు, వనం రమేశ్‌ను ఎన్నుకున్నారు. అలాగే, బీసీ సెల్ అధ్యక్షుడిగా కెక్కర్ల భద్రయ్య, ఉపాధ్యక్షుడిగా చెవుల ఎర్రయ్య, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రమణాచారి, ప్రచార కార్యదర్శిగా తాళ్లపల్లి రాజు, సభ్యులుగా ముప్పు శ్రీనివాస్, గంజి నరేందర్, చెవుల శ్రీకాంత్ ఎన్నికయ్యారు.