సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 17, 2021 , 02:22:57

ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయ్‌

ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయ్‌

  • తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కష్టపడ్డారు
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
  • ఎమ్మెల్యే నన్నపునేనితో కలిసి కేసీఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శన

కరీమాబాద్‌, ఫిబ్రవరి16: సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పుర స్కరించుకుని ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ చూడగానే తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్‌ ఆధ్వర్యంలో కరీమాబాద్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సంద ర్భంగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ప్రజలను ఒక్కటిగా చేసి ముం దుండి పోరాడారన్నారు. 14 ఏళ్లు ఆయన పడిన కష్టంతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఉద్యమానికి సం బంధించిన ఫొటోలను చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయని అ న్నారు. ఉద్యమం నుంచి నేడు సాగిస్తున్న పాలన వరకు ప్రజ లకు వివరించాలని కోరారు. ఉద్యమ చరిత్రను భావితరా లకు అందజేయాలన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేందర్‌ను ఆయన అభినందించారు. యావత్‌ తెలంగాణ కేసీఆర్‌ జన్మ దినం సందర్భంగా మొక్కలు నాటాలని కోరారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కోసం ఏం చేసినా తక్కువే అన్నారు. ఉద్యమం.. నేటి పాలనతో దేశం ఆయన వైపు చూస్తుందన్నారు. తన లాంటి సామాన్యుడికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చిన మహావ్యక్తి కేసీఆర్‌ అని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.


VIDEOS

logo