మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Sep 26, 2020 , 02:33:18

బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

  • 191 రోజుల తర్వాత రీ ఓపెన్‌ 

వరంగల్‌ క్రైం, సెప్టెంబర్‌ 25 : బార్‌ అండ్‌ రెస్టారెంట్ల రీ ఓపెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవా రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 191 రోజు ల అనంతరం బార్‌ షాపులు తెరుచుకోనున్నా యి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మార్చి 14న బార్‌ షాపులకు ఆబ్కారీ అధికారులు తాళాలు వేశారు. కాగా,

ప్రతి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమాని కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేయాలని, రెస్టారెంట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. ఉదయం, సాయంత్రం బార్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేసి, గాలి వచ్చేలా వెంటిలేషన్‌ ఏర్పా టు చేసుకోవాలన్నారు. 


logo