శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 16, 2020 , 01:39:54

పర్యావరణ హితంగా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు

పర్యావరణ హితంగా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు

  • మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌, జూలై 15: పర్యావరణ హితంగా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. స్మార్ట్‌సిటీ కార్యక్రమంలో భాగంగా రాశా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ఆధ్వర్యంలో అధునాతన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లపై కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహిం చారు. మేయర్‌ మాట్లాడుతూ అధునాతన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల ఏర్పా టు కోసం టెండర్లు పిలిచినట్లు చెప్పారు. త్వరలోనే ప్రత్యేక కమిటీ ఎదుట తెరుస్తామని అన్నారు. నగరంలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల ఆధునిక ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.    బాలసముద్రం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ నుంచి చెత్త తరలింపు సమయంలో వాసన రాకుండా మూడు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెం ట్‌ నిబంధనల మేరకు చెత్తను ల్యాండ్‌ ఫిల్లింగ్‌ చేస్తామని అన్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఈ విద్యాసాగర్‌, ఈఈ లక్ష్మారెడ్డి, స్మార్ట్‌సిటీ ప్రతినిధి ఆనంద్‌ వోలేటి, డీఈ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.logo