శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 15, 2020 , 01:51:28

అడవి ఒడిలో అలరించేలా...

అడవి ఒడిలో అలరించేలా...

వాజేడు/నర్మెట/గూడూరు : వారం పది రోజుల నుంచీ కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు జలపాతాలు పరవళ్లు తొక్కుతూ కట్టిపడేస్తున్నాయి. అడవి ఒడిలో జాలువారుతున్న నీటి పొంగులు అలరిస్తున్నాయి. జలపాతాలకు నెలవైన ములుగు జిల్లా వాజేడు మండలంలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చీకుపల్లి అడవుల్లో ‘బొగత’, కొంగాల అడవుల్లో ‘వీ ఫాల్స్‌' , దూలపురం అడవుల్లో ‘మాసలొద్ది’, మొరుమురు అడవుల్లో ఒక జలపాతం వెలుగులోకి రాగా ఇప్పుడు కృష్ణాపురం శివారు అటవీప్రాంతంలో ఉన్న మోడికుంట ప్రాజెక్టు దగ్గర్లో ‘మోడికుంట జలపాతం’ బాహ్య ప్రపంచానికి తెలిసింది. కొందరు యువకులు ఈ జలపాతం వద్ద సందడి చేస్తూ తీసుకున్న సెల్ఫీలతో ఇక్కడో జలపాతం ఉందన్న విషయం బయటకు వచ్చింది. జనగామ జిల్లా నర్మెట మండలం గండిరామారం (మల్లన్నగండి) రిజర్వాయర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం సందర్శకులను అకట్టుకుంటున్నది. గోదావరి జలాలు రావడంతో పాటు వర్షాలు పడే సమయంలో ఈ జలపాతం అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. జలపాతం పరవళ్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని ‘భీమునిపాదం’ జలపాతం కనువిందు చేస్తున్నది. ఎగువప్రాంతం నుంచి వస్తున్న వరద, ఇక్కడి గుట్టలపై నుంచి కిందకి పడుతూ ఆకర్షిస్తున్నది.  


logo