మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 08, 2020 , 02:29:52

ఆమె నేస్తం చెలి

ఆమె నేస్తం చెలి

(వరంగల్‌,నమస్తేతెలంగాణ) 18 ఏళ్ల క్రితం 10 మంది సభ్యులతో చాముండేశ్వరీ మహిళా పొదుపు సంఘా న్ని హసన్‌పర్తి మండల కేంద్రంలో ఏర్పా టు చేసుకున్నారు. ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తున్న సంఘ సభ్యులు స్వయంగా ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారీ యూనిట్‌ను స్థాపించుకున్నారు. ఐదు నెలల క్రితం ఏర్పాటు చేసి న యూనిట్‌ అంచెలంచెలుగా ఎదుగుతున్నది. ప్రస్తుత పోటీ ప్రపంచం, వ్యాపారం రంగంలో అనుభవం లేనప్పటికీ వారంతా ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తూ తమ ప్రొ డక్ట్‌ను మార్కెటింగ్‌ చేస్తున్నారు. యూనిట్‌ లో నెలకు 20 వేల ప్యాకెట్లను తయారు చేస్తున్న వారు ప్రస్తుతం మహిళా సంఘాలకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌ (టీఎల్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ప్రతినెలా సమావేశంలో తమ ప్రొడక్ట్‌ను మార్కెటింగ్‌ చేస్తున్నారు. 


అహ్మదాబాద్‌లో శిక్షణ

మహిళలు వంటగది దాటరని ఎగతాళి చేసే ప్రస్తుత సమాజంలో తాము అన్ని రంగాల్లో రాణిస్తామంటూ చాముండేశ్వరీ మహిళా సంఘం సభ్యులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో వారు న్యాప్‌కిన్స్‌ ఉత్పత్తుల తయారీలో శిక్షణ కోసం అహ్మదాబాద్‌కు వెళ్లారు. అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అక్కడ వారం రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత మహిళలు తమ సొంత పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మెప్మా అందిస్తున్న సహకారంతో వారు న్యాప్‌కిన్స్‌ తయారీ, మార్కెటింగ్‌లో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 


ప్లాస్టిక్‌ రహిత ఉత్పత్తులు

చాముండేశ్వరీ మహిళా సంఘం సభ్యులు తయారు చేస్తున్న చెలి శానిటరీ న్యాప్‌కిన్స్‌ పూర్తిగా ప్లాస్టిక్‌ రహితంగా తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధించిన నేపథ్యంలో ప్లాస్టిక్‌ రహిత న్యాప్‌కిన్స్‌ ఉత్పత్తులు దేశంలోనే ఇక్కడ తయారు చేస్తుండడం గమనార్హం. న్యాప్‌కిన్‌ ప్యాడ్స్‌తో పాటు కవర్‌ ప్యాకింగ్‌ పేపర్‌తో తయారు చేస్తున్నారు. మార్కెట్లో లభిస్తున్న ఖరీదైన కార్పొరేట్‌ సంస్థలు తయా రు చేస్తున్న శానిటరీ న్యాప్‌కిన్‌ ప్రొడక్స్‌ ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ను వినియోగిస్తున్నారు. లోకల్‌ బ్రాండ్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ‘చెలి’ న్యాప్‌కిన్స్‌ ప్యాడ్లు పూర్తిగా కాటన్‌తో రూపొందించడం ప్రత్యేకత.


‘చెలి’ ప్రత్యేకతలు అనేకం

లోకల్‌ బ్రాండ్‌గా మహిళలు తయారు చేస్తున్న చెలి శానిటరీ న్యాప్‌కిన్స్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి హైజెనిక్‌ శానిటరీ ప్యాడ్లను తయారు చేస్తున్నారు. మహిళలే స్వశక్తితో న్యాప్‌కిన్‌ ప్యాడ్స్‌  తయారు చేస్తుండడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్‌ రహిత ప్యాడ్స్‌ తయారీలో ఉర్‌ఫల్ఫ్‌ షీట్‌ను వినియోగించడం ప్రత్యేకత. ఎలాంటి బ్యాక్టీరియా ఉండకుండా ప్యాక్‌ చేసే ముందు న్యాప్‌కిన్‌ను గంటన్నర పాటు స్టెరిలైజేషన్‌ చేయడం, ప్యాకింగ్‌ కోసం పేపర్‌ కవర్లను వినయోగించడం ఈలోకల్‌ బ్రాండ్‌ ప్రత్యేకత. 


logo