శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 28, 2020 , 05:37:18

విభాగాల మధ్య సమన్వయం అవసరం

విభాగాల మధ్య సమన్వయం అవసరం

వరంగల్‌, నమస్తేతెలంగాణ : బల్దియాలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరం అని కమిషనర్‌ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కౌన్సిల్‌ హాల్‌లో  అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పనితీరు బాగుందని  ప్రశంసించారు. పీఎఫ్‌ సంబంధిత అంశాలపై ఆమె అధికారులకు సూచనలు చేశారు. 2011 నుంచి పీఎఫ్‌ నెంబర్‌ ఇవ్వాలని అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందచేయాలని  అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఇంకా బాగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా రిపబ్లిక్‌ వేడుకల్లో నగర పోలీస్‌ కమిషనర్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం పనితీరు బాగుందని ప్రశంసించారని ఆమె అన్నారు. ఆక్రమణలు, కూల్చివేతలు నిరంతర ప్రక్రియ అన్నారు. 6 నెలలు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెండు విభాగాలు కలిసి పని చేస్తేనే పనులు వేగంగా పూర్తవుతాయని అన్నారు. పల్లె ప్రగతిలో మంచి ఫలితాలు సాధించిన టీంలకు అవార్డులు దక్కడం సమష్టి పనితీరుకు నిదర్శనం అన్నారు. అధికారుల పనితీరుపై సీడీఎంఏ కార్యాలయం నుంచి నిఘా ఉంటుందని జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి ఆదనపు కమిషనర్‌ నారాయణరావు, సీహెచ్‌వో సునీత, ఇన్‌జార్జి సీపీ నర్సింహారాములు, కార్యదర్శి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్‌ గోదుమల రాజు, అధికారులు పాల్గొన్నారు.


logo