బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి

వనపర్తి టౌన్/రూరల్/చిన్నంబావి, జనవరి 24 : బా లికలు అన్ని రంగాల్లో ముందుండాలని ఇండియన్ మెడికల్ వనపర్తి జిల్లా చైరపర్సన్ లలితకుమారి అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాల గ్రామశివారులో ఉన్న చే యూత ఆశ్రమంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బేటి బచావో, బేటి పడావో కార్యక్రమాన్ని ఉమెన్స్ డాకర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు చదువుపై ఆస క్తి పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు ఆశ్ర మ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందు లు, పండ్లు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాలసదనం, సఖీ కేంద్రా ల్లో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిణి పుష్పలత హాజరై మాట్లాడుతూ బాలికల చట్టాలు, రాజ్యాంగంలో కల్పిస్తున్న ప్రత్యేక అంశాలపై వివరించారు. చిన్నంబావి మండలం కొప్పునూరు, అయ్యవారిపల్లె, కాలూరు గ్రా మాల్లో శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉమెన్స్ వైద్యుల విభాగం చైర్మన్లు శారద, మోహన, వైద్యులు లక్ష్మీకుమారి, నిర్మలాదేవి, దివ్య, ఆరుణజ్యోతి, ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్‌రెడ్డి, బాలసదనం సూపరింటెండెంట్ కవిత, మానసిక వైద్య నిపుణుడు సురేశ్, ఆర్డీఎస్ నిర్వాహకులు చిన్నమ్మ థామస్, కోఆర్డినేటర్ కృష్ణచైతన్య, డీసీపీవో రాంబాబు, సురేందర్, యాదమ్మ, సఖీ నిర్వాహకురాలు గిరిజాప్రీతి, జెడ్పీటీసీ వెంకటరామమ్మ, సర్పంచులు కౌసల్యారెడ్డి, రామస్వామి, ఎంపీటీసీ లక్ష్మి, ఎస్వీకే కోఆర్డినేటర్లు తిరుపాలు, మహేశ్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, తిరుపాలు, ఉపసర్పంచ్ ఆనంద్‌యాదవ్, ఎస్ఎంసీ చైర్మన్లు నర్సింహ, వెంకటేశ్, అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, సుజాత, భాగ్యమ్మ, ఎస్వీకే సిబ్బంది హైమావతి, దీపిక పాల్గొన్నారు.
తాజావార్తలు
- రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి కొప్పుల
- టీకా వేసుకున్న రక్షణమంత్రి.. కోవిన్‌లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు
- బకాయిలు చెల్లించకున్నా కరెంటు కట్ చేయం : అజిత్ పవార్
- Mi 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!