మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 14, 2020 , 02:11:43

రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి

వనపర్తి రూరల్‌ : రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యమ ని, రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా నిలిచేలా ప్ర భుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగవరంతండా, నాచహాళ్లీ, చిట్యాల గ్రామాల్లో ఐకే పీ, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కిచ్చారెడ్డి తో కలిసి జెడ్పీ చైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకాలు వేయాలని సూచించిందని దాని కనుగుణం గా రైతులు కూడా ముందుకు సాగారన్నారు. దా నిని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు కూడా చేస్తుందని తెలిపారు. రా నున్న రోజుల్లో రైతులు లభదాయకమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, సహకార సంఘాల చైర్మన్‌లు వెంకట్రావ్‌, మధుసూదన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ రాజు, డీసీసీబీ బ్యాంక్‌ మేనేజర్‌ సత్యప్రకాశ్‌, చిట్యాల సర్పంచ్‌ భానుప్రకాశ్‌, నాచహాళ్లీ సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, మా ర్కెట్‌ యార్డు డైరెక్టర్లు, నాయకులు మనోహర్‌సాగర్‌, సుదర్శన్‌రెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు, వ్యవసాయశాఖ సిబ్బంది, ఐకేపీ, సహకార సంఘాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం/రేవల్లి : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పీ కృష్ణనాయక్‌, జెడ్పీటీసీ సామ్యనాయక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మానాజీపే ట గ్రామంలో శుక్రవారం పీఏసీసీఎస్‌ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. రేవల్లి మండలం చెన్నా రం, చీర్కపల్లి, గొల్లపల్లి, రేవల్లి, నాగపూర్‌, శానాయిపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ భీమయ్య, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు నారాయణరెడ్డిలతో కలిసి ఎంపీపీ సేనాపతి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాడు. కార్యక్రమంలో సర్పంచ్‌ సతీశ్‌, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ రాజు, అధికారులు సునీల్‌కుమార్‌, ఎండీ ఫిరోజ్‌, సర్పంచులు రమేశ్‌యాదవ్‌, శాంతయ్య పాల్గొన్నారు. 

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : మండలంలోని ఏదుల గ్రామంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సింగిల్‌విండో చైర్మన్‌ రఘుయాదవ్‌, సర్పంచ్‌ నాగమణి, ఎంపీటీసీ నరేందర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో సీఈవో రామ్మోహన్‌, వైస్‌ ఎంపీపీ చం ద్రశేఖర్‌, ఉప సర్పంచ్‌ ఆంజనేయులు, రైతుబం ధు మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్‌, టీఆర్‌ఎ స్‌ మండలాధ్యక్షుడు బాల్‌రాజు,  శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, మతీన్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

మదనాపురంలో..

మదనాపురం : రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ జన్ను పద్మావతి అన్నారు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, అజ్జకొల్లు, నర్సింగాపురం, కొన్నూరు, గోపన్‌పేట, కర్వెన గ్రామాల్లో మార్కెట్‌ చైర్మన్‌ బాలనారాయణ, జెడ్పీటీసీ కృష్ణయ్యతో కలిసి సింగిల్‌విండో, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకట్‌నారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు భాగ్యలక్ష్మమ్మ, టీకే శారద, బ్రహ్మమ్మ, జగదీశ్‌, ఆంజనేయులు, అనిత, రాంనారాయణ, ఎంపీటీసీలు సరస్వతి, రాములు, కురుమన్న, కిషన్‌నాయక్‌, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ హనుమాన్‌రావు, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, డైరెక్టర్లు నాగేంద్రం, నర్సింహ, మురళి, సీడీసీ డైరెక్టర్‌ బాలకృష్ణ, కోఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు సాయిలుయాదవ్‌, ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, గ్రామాధ్యక్షు డు కరుణాకర్‌రెడ్డి, గోవర్ధన్‌, నాయకులు లక్ష్మణ్‌రావు, అచ్యుతరెడ్డి, యాదగిరి, మహదేవన్‌గౌడ్‌, మహేశ్‌, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, వెంకటేశ్‌, శివరాములు, ఆశోక్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.