శుక్రవారం 04 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 29, 2020 , 03:01:51

పీహెచ్‌సీని అభివృద్ధి చేసుకోవాలి

పీహెచ్‌సీని అభివృద్ధి చేసుకోవాలి

  • రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: ఎంపీపీ కిచ్చారెడ్డి 

వనపర్తి రూరల్‌: కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండలంలోని సర్పంచులు సమష్టిగా అభివృద్ధి చేసుకోవాలని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. బుధవారం పీహెచ్‌సీలో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీతోపాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో రవిశంకర్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన జాతీయ నిధులను అభివృద్ధి పనులకు వెచ్చించి రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏటా వచ్చే నిధులతో దవాఖానకు కావాల్సిన వసతులను సమకూర్చాలన్నారు. యునాని వైద్యం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని, ఇతర గ్రామాల నుంచి వచ్చే వారికోసం ప్రత్యేక వంటగది ఏర్పాటు చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానం చేసి అధికారులకు పంపించాలని కోరారు.

అంతకుముందు డిప్యూటీ డీఎంహెచ్‌వో రవిశంకర్‌ మాట్లాడుతూ పీహెచ్‌సీలో చికిత్స, ప్రసవాలకు వచ్చేందుకుగానూ గ్రామాల్లోని ప్రజలను సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సువర్ణ, ప్రోగ్రాం అధికారి ఇస్మాయిల్‌, డాక్టర్‌ రాకేష్‌రెడ్డి, యునాని వైద్యుడు ఎక్బాల్‌, మెంటపల్లి సర్పంచ్‌ రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు బాలకృష్ణ, శ్రీనివాసులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి

వనపర్తి మండలంలోని పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని ఎంపీపీ కిచ్చారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అంకూర్‌, వెంకటాపురం, చీమనగుంటపల్లిలో ఓటుహక్కు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని ప్రతి పట్టభద్రుడు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంకూర్‌ సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు విష్ణుయాదవ్‌, బాలరాజు, నరేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ మెంబర్‌ శంషోద్దీన్‌, రామకృష్ణ, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

రైతు వేదిక భవనాల పరిశీలన

వనపర్తి మండలంలోని రైతు వేదిక భవన నిర్మాణాలను బుధవారం ఎంపీపీ కిచ్చారెడ్డి పరిశీలించారు. సవాయిగూడెం, అంకూర్‌ గ్రామాన్ని సందర్శించి సర్పంచులతో మాట్లాడారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంకూర్‌ సర్పంచ్‌ విష్ణువర్థన్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మన్‌, నాయకులు విష్ణుయాదవ్‌, బాలరాజు, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.