మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Oct 27, 2020 , 01:42:23

మత సామరస్యానికి ప్రతీక వనపర్తి

మత సామరస్యానికి ప్రతీక వనపర్తి

మంత్రి నిరంజన్‌రెడ్డి

ముస్లింలకు దసరా విందు ఇచ్చిన మంత్రి

వనపర్తి : దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా కేం ద్రంలోని ముస్లింలకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయం లో విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం లు ముందుగా మంత్రి నిరంజన్‌రెడ్డికి దసరా పండుగ శుభాకాంక్షలను తెలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మత సామరస్యానికి వనపర్తి ప్రతీకని అందుకు దసరా పండుగను ఉద్దేశించి ముస్లింలకు విందును ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రికి జమ్మి ఆకు పెట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ భాస్కర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు. 

వీపనగండ్లలో..

వీపనగండ్ల : మండలంలోని కల్వరాల గ్రామానికి చెంది న వంగూరు నరసింహారెడ్డి గృహాప్రవేశ కార్యక్రమానికి మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్‌ శ్రేణులు సర్ధార్‌, రవీందర్‌రెడ్డిలతో స్థానిక సమస్యలపై మంత్రి ముచ్చటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేర్చడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.